చేతులకు గమ్ము పెట్టి అతికించినట్లు, పుట్టుకతోనే ఒక వస్తువు మన చేతికి అతికి పుట్టినట్లు ప్రస్తుతం ఎవరి చేతులో చూసినా కూడా ఫోన్ ఉంటుంది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే అందులోనే తమ రోజును గడిపేస్తున్నారు. ఒక గంట సేవు నెట్ పనిచేయడం ఆగిపోతే భూకంపం వచ్చి ప్రపంచం మొత్తం ఊగిపోయినట్లు అవుతున్నారు మనుషులు. అవసరం ఉన్నా లేకపోయినా సెల్‌ఫోన్‌లో గంటలకొద్ది మాట్లాడటం.. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌ల్లో చాటింగ్స్‌తో సమయం వృథా చేయడం చేస్తున్నారు.
రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు మొబైల్‌తో పాటు యాప్స్‌ను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇటీవల మొబైల్ రీసెర్చ్ సంస్థ ‘యాప్ అన్నీ’ (App Annie)ఇంటర్నెట్‌లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు భారతీయులు ఎంత సేపు యాప్స్‌పై గడుపుతున్నారనే అంశంపై స్టడీ చేసింది. ఈ స్టడీలో భారతీయులు యాప్స్‌లలో ప్రతీరోజూ 4.8 గంటలు గడిపేస్తున్నట్లు తేలింది. యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(5.5గంటలు), బ్రెజిల్ (5.4గంటలు),సౌత్ కొరియా(5.0గంటలు), ఇండియన్స్ (4.8గంటలు) తొలి స్థానాల్లో ఉండగా.. జపాన్, కెనడా,యూఎస్,రష్యా,టర్కీ, యూకే దేశాల్లో ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది. టిక్ టాక్ తర్వాత వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, జూమ్ యాప్స్ వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి జూన్ వరకు పై యాప్స్‌ను వినియోగించగా.. జులై నుంచి ఎక్కువ మంది సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు తేలింది.
Indians spent nearly 5 hrs daily on phone apps in Q3 2021, finds App Annie’s new report https://t.co/QDZwbw36ue
— Republic (@republic) October 18, 2021