భరతమాత ముద్దుబిడ్డలు ఇండియన్ సోల్జర్స్. వారి గుండె ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి సైనికులు సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటారు. కానీ.. బోర్డర్ లోనే కాదు, బోర్డర్ లోపల కూడా తప్పు జరిగితే దేశ సైనికుడు చూస్తూ ఊరుకోడు. పైగా.., వయసు అయిపోయి, నడుం వంగిపోయి, ఒంట్లో శక్తిని కోల్పోయిన తల్లి.. తన కళ్ళ ఎదురుగా కష్టపడుతుంటే ఏ సిపాయి మాత్రం సాయం చేయకుండా ఉంటాడు? ఇప్పుడు ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ తల్లి తన కొడుకును కష్టపడి పెంచి, పెళ్లి చేసింది. వృద్ధాప్యంలో నాలుగు మెతుకులుపెట్టి సుఖంగా కాటికి సాగనంపుతాడులే అని ఆశ పడింది. కానీ.., వచ్చిన కోడలకి ఆ ముసలి ప్రాణం అడ్డం అయ్యింది. కన్న కొడుకుకి ఆ తల్లి భారం అయ్యింది. వారిద్దరూ కలసి ఆమెని రోడ్ మీదకి నెట్టేశారు. రోడ్ పై కోడలు ఆ తల్లిని నెట్టేస్తున్నా.., కొడుకు భార్యకి సపోర్ట్ చేస్తూ.. తల్లి ప్రేమని అపహాస్యం చేశాడు. ఆ తల్లి నన్ను బయటకి నెట్టేయకండి, ఈ వయసులో నేను బయటకి వెళ్లి ఎలా బతకగలను అంటూ మొత్తుకున్నా వారి మనసు మారలేదు. కానీ.., ఇక్కడే ఒక అద్భుతం చోటు చేసుకుంది.
ఆ సమయంలో అటుగా ఓ భారత జవాన్ వచ్చారు. రోడ్ పై ఆ తల్లి పరిస్థితిని గమనించి.. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఎందుకు ఆ ముసలావిడని నెట్టేస్తున్నారు? అంటూ ఆరా తీశాడు. దీంతో.., కొడుకు రంగంలోకి దిగాడు. ఆమె నా తల్లి. నాకు ఆమెని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఇదంతా నా కుటుంబ విషయం. ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ.. జవాన్ ని సైతం నెట్టడానికి ప్రయత్నించాడు. జవాన్ కి పరిస్థితి అర్ధం అయ్యింది. ఆ తల్లి కష్టం తెలిసి వచ్చింది. వెంటనే.. తల్లిని కష్టపెడుతున్న ఆ కొడుక్కి ఆర్మీ స్టయిల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.
దెబ్బకి అతను దారిలోకి వచ్చాడు. అప్పటి వరకు అత్తను నెట్టేస్తూ అక్కడే నిలబడ్డ ఆ కోడలు.. భర్తపై ఒక్క దెబ్బ పడగానే భయంతో పరుగులు తీసింది. పాపం.. ఆ తల్లి మాత్రం జవాన్ కాళ్ళకి దండం పెట్టి.. కొడుకుపై మరో దెబ్బ పడకుండా ఆపింది. దెబ్బతో బుద్ది వచ్చిన కొడుకు ఆ తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., ఈ మొత్తం వ్యవహారంలో తల్లికి న్యాయం చేయడమికి జవాన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.