చెన్నై(డిజిటల్ డెస్క్) నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ఫేమ్, తమిళ హీరో సిద్ధార్థ్ కు, బీజేపీ నేతలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతకంతకు విదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై సందర్బం వచ్చినప్పుడల్లా సిధ్దార్ధ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. బీజేపీ సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతోందని చాలా సార్లు ట్వీట్టర్ లో కామెంట్ చేశాడు సిద్దార్ధ్. ఐథే ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేతలు సైతం హీరో సిధ్దార్ధ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వారం రోజు క్రితం సిద్ధార్ధ్ కుటుంబాన్నంతా చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి సిద్ధార్ధ్ కు. దీనిపై సిద్దార్ధ్ పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. ఇలా సిద్దార్ద్ కు, తమిళ బీజేపీ నేతలకు వివాదం నడుస్తోంటే.. ఇప్పుడు ఇష్యూలోకి ఏపీ బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా సిద్దార్ధ్ ను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ నీ సినిమాలన్నింటికీ దావూద్ ఇబ్రహీం పన్ను చెల్లిస్తాడట కదా, ముందు దీనికి సమాధానం చెప్పు.. అంటూ హీరో సిద్ధార్థ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్‌కు ఏ మాత్రం ఆలస్యం చేసుకుండా కౌంటర్ వేశాడు సిద్ధార్థ్. నో.. దావూద్ ఇబ్రహీం నా పన్నులు కట్టడం లేదు.. అందుకు ఆయన సిద్ధంగా కూడా లేరు.. నేను నిజమైన దేశ పౌరుడిని.. అలాగే పన్ను చెల్లించే వ్యక్తిని.. అంటూ ధీటిగా సమాధానం చెప్పారు. ఐతే సిద్దార్ధ్ కౌంటర్ పై ఇంకా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించలేదు. మొత్తానికి హీరో సిద్దార్ధ్ వర్సెస్ బీజేపీ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందన్నది ఇటు సినీ వర్గాలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.