బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ హీరో సిద్దార్థకు గట్టిగానే కౌంటరిచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అంటూ సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు.. ‘‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం సేఫ్‌గా ఉన్నామని ఎలా అనుకోగలం అంటూ, ఆటంకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు.
No nation can claim itself to be safe if the security of its own PM gets compromised. I condemn, in the strongest words possible, the cowardly attack on PM Modi by anarchists.#BharatStandsWithModi #PMModi
— Saina Nehwal (@NSaina) January 5, 2022
ఇందుకు స్పందించిన హీరో సిద్ధార్థ “చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే” అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్ చేశాడు.
Subtle cock champion of the world… Thank God we have protectors of India. 🙏🏽
Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz
— Siddharth (@Actor_Siddharth) January 6, 2022
ఈ విషయంపై తాజాగా సైనా నెహ్వాల్ తండ్రి తను ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకు తెలుసు కాబట్టే.. తన విలువను గుర్తించారు’’ అని హర్వీర్ భావోద్వేగానికి గురయ్యారు. కాగా కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.