సోషల్ మీడియాలో స్టార్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై సినీ నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అతను చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపి ఆఖరికి సైనాకి బహిరంగ క్షమాపణ చెప్పేలా చేసింది. తాజాగా యాక్టర్ సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా తాను చేసిన ట్వీట్ పై వివరణ ఇస్తూ, క్షమాపణలు తెలుపుతూ సైనాకి బహిరంగ లేఖ రాశాడు.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022
ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి సైనా నెహ్వాల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘తమ సొంత ప్రధానికి సరైన భద్రత కల్పించలేని ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. సైనా ట్వీట్ కి సిద్ధార్థ్ వ్యంగంగా వాడిన కాక్ అనే పదం పలు అభ్యంతరాలకు దారితీసింది.
No nation can claim itself to be safe if the security of its own PM gets compromised. I condemn, in the strongest words possible, the cowardly attack on PM Modi by anarchists.#BharatStandsWithModi #PMModi
— Saina Nehwal (@NSaina) January 5, 2022
ఆ కారణంగా సిద్ధార్థ్ ఒక మహిళను కించపరిచే కామెంట్ చేశాడంటూ ఏకంగా మహిళా కమీషన్ అతని పై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది.తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన సిద్ధార్థ్.. “నేను ఎవరినీ కించపరచాలనే ప్రయత్నం చేయలేదు. సైనా పెట్టిన ట్వీట్ మీద నేను చేసిన కామెంట్ ఒక జోక్ మాత్రమే. ఆ కామెంట్ ఇంతమందిని బాధించిందని, మహిళలను కించపరిచే ఉద్దేశంతో మాత్రం చేయలేదు ఓ గొప్ప క్రీడాకారిణిగా సైనాని నేను ఎప్పుడూ గౌరవిస్తాను” అంటూ లేఖలో పేర్కొన్నాడు.
This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful @Actor_Siddharth
— Parupalli Kashyap (@parupallik) January 10, 2022
ముందుగా అనాల్సినవి అనేస్తారు.. ఆ తర్వాత పీకల మీదకి వచ్చేసరికి ఇలా క్షమాపణలు చెప్పడం కామన్ అయిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సైనా భర్త పారుపల్లి కశ్యప్ కూడా ట్విట్టర్ లో స్పందించి.. ‘మీ అభిప్రాయాలను తెలపండి. కానీ గౌరవప్రదమైన పదాలను యూజ్ చేయండి’ అంటూ సిద్ధార్థ్ పై ట్వీట్ చేయడం విశేషం. దీంతో నెట్టింట సిద్ధార్థ్ ట్వీట్ వైరల్ అవుతోంది. మరి సిద్ధార్థ్ బహిరంగ లేఖ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.