కేవలం ఐసీసీ ట్రోఫీ కోసం కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ని తప్పించి రోహిత్ కి పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. ఐపీఎల్ లో సక్సెస్ అయిన రోహిత్ టీమిండియాకు కూడా ఐసీసీ టోర్నీలు అందిస్తాడని ఆశభావం వ్యక్తం చేసింది. కానీ రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత కూడా టీమిండియా తలరాత మారలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడిన తీరు ఎవ్వరికిఈ నచ్చడం లేదు. దీంతో హిట్ మ్యాన్ పై ఇప్పుడు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం పోటీనివ్వకుండా చేతులెత్తేసింది. నాలుగవ రోజు ఆట ముగిసేసరికి చివరి రోజు 3 వికెట్లను 164 పరుగులు చేసిన టీమిండియా .. చివరి రోజు గెలవడానికి మరో 280 పరుగుల పరుగులు చేస్తే సరిపోతుంది. గ్రీజ్ లో విరాట్ కోహ్లీ రహానే ఉండడంతో అభిమానులు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నారు. కానీ కేవలం 71 పరుగులు మాత్రమే చేసి చివరి 7 వికెట్లను కోల్పోయింది. దీంతో 209 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి. గతంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడిన తీరు ఎవ్వరికిఈ నచ్చడం లేదు. దీంతో హిట్ మ్యాన్ పై ఇప్పుడు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కేవలం ఐసీసీ ట్రోఫీ కోసం కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ని తప్పించి రోహిత్ కి పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. ఐపీఎల్ లో సక్సెస్ అయిన రోహిత్ టీమిండియాకు కూడా ఐసీసీ టోర్నీలు అందిస్తాడని ఆశభావం వ్యక్తం చేసింది. కానీ రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత కూడా టీమిండియా తలరాత మారలేదు. రెండేళ్లు కష్టపడి డబ్ల్యూటీసీ ఫైనల్ కి వచ్చిన మన జట్టు ప్రతిసారి తుది మెట్టుపై బోల్తా పడడం ఒక అలవాటుగా మారింది. అయితే ఓటమిని అంగీకరించాల్సిందే. కానీ రోహిత్ మాత్రం రెండేండ్ల పాటు నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత ఫైనల్ కు ఒక్క మ్యాచ్ సరిపోదని.. బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టాలని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఇప్పటికే గవాస్కర్, రవి శాస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా హర్భజన్ సింగ్ కూడా తనదైనా శైలిలో స్పందించాడు.
హర్భజన్ మాట్లాడుతూ..”నేను రోహిత్ ను ఒక విషయం అడగాలనుకుంటున్నా. బెస్టాఫ్ త్రీని వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఆడించాలా..? ఐపీఎల్ లో కూడా ఒక ఫైనలే ఉంటుంది కదా..? ఒకవేళ ఇప్పుడు భారత్ ప్లేస్ లో న్యూజిలాండో, ఇంగ్లాండో ఉండి ఉంటే రోహిత్ ఇలాగే మాట్లాడేవాడా..? లేదు. కచ్చితంగా ఇలా మాట్లాడేవాడు కాదు. అప్పుడు ఒక్క ఫైనల్ మాత్రమే చాలు అనేవాడు. కావున 50 ఓవర్స్ వరల్డ్ కప్ లో ఒకటే ఫైనల్ ఉంటుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా ఒకటే ఫైనల్ ఉంటుంది. టెన్నిస్, ఫుట్బాల్ వంటి మెగా ఈవెంట్లలో ఒకటే ఫైనల్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.