ఆసిస్ తో జరిగే మూడు వన్డేల్లో రెండో వన్డేకు వైజాగ్ వేదిక కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రౌండ్ ను సిద్దం చేశారు నిర్వాహకులు. మార్చి 19న జరిగే ఈ మ్యాచ్ టికెట్లు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ లు ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఇక టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తో ముందంజలో ఉంది. అహ్మదాబాద్ వేదికగా ప్రస్తుతం చివరి టెస్ట్ జరుగుతోంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ అనంతరం భారత్ తో మూడు వన్డేలు ఆడనుంది ఆసిస్. ఈ మూడు వన్డేల్లో రెండో వన్డేకు వైజాగ్ వేదిక కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రౌండ్ ను సిద్దం చేశారు నిర్వాహకులు. మార్చి 19న జరిగే ఈ మ్యాచ్ టికెట్లు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్ లో క్రికెట్ కు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటే అన్ని పనులు మానుకుని ఇంట్లో టీవీలకు అతుక్కుపోతారు అభిమానులు. అయితే క్రికెట్ పై తెలుగు ప్రేక్షకులకు ఉన్న అభిమానం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇటు హైదరాబాద్ లో గానీ.. అటు వైజాగ్ లో గానీ మ్యాచ్ జరిగితే చాలు స్టేడియం కిక్కిరిసిపోవాల్సిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియతో మార్చి 19న జరిగే రెండో వన్డే కోసం వైజాగ్ లోని డా.వైఎస్ రాజశేఖర రెడ్డి-డీవీ సుబ్బారావు స్టేడియం సిద్దం అయ్యింది.అందుకు సంబంధించిన వివరాలను అధికారులు తెలిపారు.
ఇండియా-ఆసిస్ మధ్య జరిగే రెండో వన్డే కోసం మైదానాన్ని సిద్ధ చేస్తున్నామని, దానికోసం ఆంధ్రా క్రికెట అసోసియేషన్ తో పాటుగా అన్ని జిల్లాల స్పోర్ట్స్ అధికారులు కూడా తమవంతుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటుగా సిబ్బంది కూడా ఈ పనుల్లో పాల్గొన్నారు. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు ఎలా పొందాలంటే? ఆన్ లైన్ లో రిజర్వేషన్ టికెట్స్ ను మార్చి 10వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఆఫ్ లైన్ అయితే మార్చి 13 నుంచి డైరెక్ట్ గా స్టేడియం దగ్గర తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.