ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.., ఆ మాటకొస్తే రెండు తెలుసు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. నిన్ని మొన్నటి వరకు ఈయన టి.ఆర్.ఎస్ పార్టీలో మెయిన్ లీడర్. ఉద్యమ సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ప్రజానీకాన్ని పోరుబాటలోకి తీసుకొని రావడం రాజేందర్ పాత్ర ప్రత్యేకం. ఇక టి.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆయనకి పార్టీలో సముచిత స్థానమే దక్కింది. కానీ.., తరువాత కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్-ఈటల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తరువాత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, తరువాత ఆయన్ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం, బయటకి వచ్చిన ఈటల బీజేపీ కండువా కప్పుకొవకం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆయన సీఎం కావడానికి ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఈటల రాజేందర్ ఇప్పుడు మొదటిసారి నోరు విప్పాడు.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ లో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. ఈటల రాజేందర్ ని సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. “కేటీఆర్ కాబోయే సీఎంగా అంటూ ఫస్ట్ మాట్లాడిందే మీరు. కానీ.., కేటీఆర్ ని నాయకుడిగా అంగీకరించడం ఇష్టం లేకనే రాజేందర్ పార్టీలో అసమ్మతికి తెర లేపాలని ప్రయత్నం చేశారంటూ వారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు” అంటూ జాఫర్ సూటిగా ఓ ప్రశ్న వేశారు. దీనికి ఈటల రాజేందర్ కాస్త ఉద్వేగంగా సమాధానం ఇచ్చారు. ఈటల రాజేందర్ ఎప్పుడు అధికారం కోసం వెంపర్లాడిన నాయకుడు కాదు. ప్రాంతీయ పార్టీలలో మామూలుగానే వారసత్వ రాజకీయాలు ఉంటాయి. నేను ఏనాడూ వాటిని పట్టించుకోలేదు. ప్రజలకి అందాల్సిన ఫలాలు అందడం లేదు. నాయకులకి మీరు అందుబాటులో ఉండటం లేదని మాత్రమే కేసీఆర్ ని ప్రశ్నించాను. దానికి నేను భూములు ఆక్రమించుకున్నానని, వేల కోట్లు సంపాదించానని, సీఎం పీఠం కోసం పావులు కదిపారని ప్రచారం చేశారంటూ ఈటల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.