పుట్టుక, చావు అనేవి మన చేతుల్లో ఉండవు. కేవలం బ్రతకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ కాస్తా జీవితంలో ఎన్నో చేయాలి అనుకుంటాము. కొన్ని సందర్భాల్లో దేవుడు చిన్న చూపు చూసి కష్టాల్లోకి నెడతాడు. అయిన పట్టుదలతో ముందుకు వెళ్లాలి. అనుకున్న వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఓటమి ఎదురైందని అందులోనే ఉండిపోవడం, బాధ పడిపోవడం సరైనది కాదు. అచ్చం అలానే ఓ వ్యక్తి తన వైకల్యాన్ని అధికమించి ముందుకు సాగుతున్నారు. ఒంటికాలిపై సిమెంట్ బస్తాలు మోస్తూ బ్రతుకు పోరాటం చేస్తున్నారు. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్న ఈ వ్యక్తి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల వీల్‌చైర్లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేసిన డెలివరీ బాయ్, ఒంటికాలితో ఆటోను నడిపిన మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారి ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఓ వ్యక్తికి కాలు లేదు. అయినా చేతి కర్రల సహాయంతో లారీ వద్దకు వెళ్లి సిమెంట్ బస్తాలు తలపై పెట్టుకుని రెండు కర్రల సాయంతో మోస్తుండడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సదరు వ్యక్తి వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు.
అతను చేస్తున్న ఈ పని చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు, నిస్సహాయతతో ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ వ్యక్తి చేసే చర్య స్పూర్తినిస్తోంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.