మనం మారుతున్న సమాజానికి అనుగూణంగా అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు చూస్తూ వింటూ ఉంటాం. కొందరు సృష్టించినవి అయితే మరికొన్ని సహజంగానే జరిగేవి ఉంటాయి. నేటికి మనం అలాంటివి చాలా చూసే ఉంటాం. ఇక తాజాగా జరిగిన ఓ ఘటనను ఆశ్చర్యమనలా, అద్భుతమనలా అని అందరూ తమ మెదళ్లకు పని పెడుతున్నారు. కానీ చివరికి అలాంటిది ఏది కాదని తెలిసింది.
ఇక అసలు విషయానికొస్తే…మహారాష్ట్రలోని పూనే జిల్లాలోని నారాయణగావులా అనే వ్యక్తి బుల్లెట్‌పై రోడ్డుపైన రయ్యు రయ్యుమంటూ దూసుకెళ్తున్నాడు. దీంతో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డం రావటంతో ఆయనను తప్పించబోయి బుల్లెట్ నడిపే వ్యక్తి కింద పడ్డాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..? ఆ వ్యక్తి కింద పడ్డా బుల్లెట్ బైక్ మాత్రం అస్సలు కింద పడకుంటా 300 మీటర్ల మేర వరకు రోడ్డుపైనే దూసుకెళ్తూ తర్వాత రోడ్డు పక్కన కిందపడింది. ఈ ఘటనను గమనించిన కొందరు వ్యక్తులు దీనిని ఫోన్‌లో వీడియో రూపంలో బందించారు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో తెగ్ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=pZSLuiGrcSs