ఫిల్మ్ డెస్క్- మౌనంగా ఉంటున్నానని ముని అనుకుంటున్నావేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండొచ్చు.. అని హీరో చెప్పే డైలాగ్ కాస్త ఇంట్రస్ట్ గా ఉంది. ఇక.. నీ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. అని హీరోయిన్ చెప్పే డైలాగ్ కూడా ఆసక్తి కలిగిస్తోంది. అవును బతుకు బస్టాండ్ సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తి రేపుతోంది.
విరాన్ ముత్తంశెట్టి హీరోగా నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘బతుకు బస్టాండ్’. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐఎన్ రెడ్డి రూపొందిస్తున్నారు. కవితా రెడ్డి, కె. మాధవి నిర్మాతలు. తాజాగా ఈ బతుకు బస్టాండ్ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
బతుకు బస్టాండ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో ఆధరణ లభిస్తోంది. మంచి ఎమోషన్ కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించినట్లుగా నిర్మాతలు ఐ కవితా రెడ్డి, కె. మాధవి చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
ఇక సినిమా టైటిల్‌కు సంబంధించి ట్రైలర్ చివరిలో హీరో చెప్పే ‘‘ప్రతిదానికి మీనింగ్స్ వెతకడానికి ట్రై చేయకువా.. సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదో చెప్పు..’’ అనే డైలాగ్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బతుకు బస్టాండ్ సినిమీ ట్రైలర్ చూసెయ్యండి.