ఫిల్మ్ డెస్క్- బండ్ల గణేష్.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరేమో. ఎందుకంటే బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ వల్లే తాను సినిమా ఇండస్ట్రీలో ఇంత పొజీషన్ కు వచ్చానని చెబుతంటాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఎక్కడ ఉన్నా, ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది.
ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా స్టార్ మా ఛానల్లో సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రసారం అవుతుంది కదా. తాజాగా ఈ షోకి గెస్ట్‌గా వచ్చిన బండ్ల గణేష్ఎ తనకు సంబందించిన చాలా విషయాలను పంచుకున్నాడు. ఇక ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్‌ని దేవుడిగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ షోకి బండ్ల గణేష్ తనతో పాటు ఆయన కూతురు జననిని కూడా తీసుకుని వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓంకార్ ముందు తన కూతురు జనని కోరిన రెండు కోర్కెలను బయటపెట్టాడు బండ్ల గణేష్.
సిక్త్స్ సెన్స్ షోలో బండ్ల గణేష్ చెప్పింది ఆయన మాటల్లో.. నా కూతురికి 18 ఏళ్లు, ఈ 18 ఏళ్లలో నన్ను రెండే ప్రశ్నలు అడిగింది, నాన్నా పవన్ కళ్యాణ్ గారితో మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావ్? ఓంకార్ అన్నయ్య షోకి వెళ్తే నన్ను తీసుకుని వెళ్లు అని, అందుకే తీసుకుని వచ్చా, అదీ నీకు ఉన్న క్రెడిబిలిటీ.. అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఎప్పుడూ తనదైన స్టైల్లో మాట్లాడే గణేష్.. సిక్స్త్ సెన్స్ షోలో కూడా తన మార్క్ చూపించాడు.
ఇక పవన్ కళ్యాణ్ ను పొగటంలో భాగంగా వెంకటేశ్వర స్వామికి ఏం ఉత్సవాలు చేస్తారో డాలర్ శేషాద్రికి తెలియదా, అలాగే పవర్ స్టార్ గురించి బండ్ల గణేష్‌కి తెలియదా, ఆయన నా దేవుడు, నా ఆస్తి, నా సర్వస్వం, ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా అంటూ తన భక్తిని చాటుకున్నాడు బండ్ల గణేష్. ఎంతైనా మాటకారి కదా మరి.