ఫిల్మ్ డెస్క్- అషూ రెడ్డి తెలుసు కదా.. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార ఒక్కసారిగా ఫేమస్ అయిన అషూ, ఆ తరువాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వూతో సంచలనం సృష్టించింది. ఆర్జీవీ ఇంటర్వూతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది అషూ రెడ్డి. ఇక ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఓ వైపు బుల్లితెర షోలు, మరో వైపు సినిమాలు, రియాల్టీ షోలో.. ఇలా చాలా బిజీ అయిపోయింది అషూ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో అషూ రెడ్డి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే. తన లెటెస్ట్ ఫోటో షూట్ లు, తన ప్రాజెక్టుకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది అషూ రెడ్డి. అంతే కాదు వీలున్నప్పుడల్లా సోషల్ మీడియా ద్వార అభిమానులతో ముచ్చట్లు కూడా చెబుతుంది.
అషూ రెడ్డి తాజాగా తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో టచ్ లోకి వచ్చింది. ఇన్ స్టా స్టోరీస్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొంది. ఇంకేముంది ఒక్కో నెటిజన్ ఒక్కో రకమైన ప్రశ్నను అడిగాడు. సాధారణంగా సెలెబ్రిటీలను ఫోన్ నంబర్ ను ఫ్యాన్స్ అడగడం సహజం. ఐతే అనూహ్యంగా అషూ రెడ్డికే తన సెల్ నంబర్ పంపించి, అక్కా నీతో మాట్లాడాలని ఉంది కాల్ చేయ్ అని అని కోరాడు ఓ అభిమాని.
మరి ఏమనుకుందో ఏమో గాని అషూ రెడ్డి చేయితో తల పట్టుకున్నట్టుగా ఓ ఫోటో పెట్టింది. ఈ సందర్బంగా సదరు ఫ్యాన్ పెట్టిన ఫోన్ నంబర్ అందరికి కనిపించింది. అలా అషూ రెడ్డి, తన అభిమాని పంపిన సోల్ నంబర్ ను షేర్ చేయడంతో, ఆమె ఫాలోవర్లంతా అతడికి ఫోన్లు చేస్తున్నారట. వరుసుగా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు, ఆ పోస్ట్ డిలీట్ చేయ్ అక్కా అని అతడు అషూ రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. అడగ్గానే డిలీట్ చేస్తే అషూ రెడ్డి ఎందుకవుతుంది చెప్పండి, సేవలను ఎంజాయ్ అంటూ కూల్ గా చెప్పింది.