ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు కేంద్ర బిందువు. సినిమాల ద్వారానే కాదు.. సోషల్ మీడియా ద్వార కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు రాము. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేయనిదే వర్మకు రోజు గడవదు. తాజాగా నెల్లూరు ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందుపై కూడా సెటైర్ వేశారు ఆర్జీవి. ఆనందయ్య కోసం అమెరికా ప్రెసిడెంట్ బైడన్ వస్తున్నారని వ్యంగ్యాస్త్రం సంధించాడు. ఇక రాంగోపాల్ వర్మను ఇంటర్వూ చేయాలని న్యూస్ ఛానల్స్ నుంచి మొదలు, యూట్యూబ్ ఛానల్స్ వరకు అంతా పోటీ పడుతుంటారు. ఎందుకంటే ఆర్జీవీని ఇంటర్వూ చేస్తే అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఇంటర్వూలో వర్మ ఎదో ఒక కాంట్రవర్సీ మాట్లడటం, అది సంచలనం కావడం ఎప్పుడూ జరిగేవే. ఐతే వర్మను ఇంటర్వూ చేయడం అంత ఆశామాషి వ్యవహారం కాదు.
ఆయన ప్రశ్నలడిగే యాంకర్ నే తికమక పెడతాడు. లేడీ యాంకర్స్ తో ఐతే ఆర్జీవీ ఆడుకుంటాడంటే అతియోశక్తి కాదేమో. ఐతే చాలా మంది మహిళా యాంకర్స్ ను మీరు బావున్నారని, మీరు నచ్చారని వర్మ చెప్పడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ సారి ఓ ఇంటర్వూలో ఓ యూట్యూబ్ చానల్ యాంకర్ వర్మ నచ్చాడని చెప్పేసింది. మీ కళ్లు బావుంటాయని, నన్ను పెళ్లి చేసుకుంటారా అని డైరెక్ట్ గా రాముని అడిగేసింది యాంకర్. ముందు కాస్త షాక్ తిన్న ఆర్జీవి.. వెంటనే తెరుకుని తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. నేను పెళ్లి చేసుకున్నాము అని సమాజానికి తెలియడానికి తాళి, గీలి లాంటి నాన్సెన్స్ చాలా ఉంటాయని అన్నారు వర్మ. నేను ఒకప్పుడు స్త్రీని ప్రేమించేవాడిని.. కానీ ఇప్పుడు స్త్రీలని ప్రేమిస్తున్నాను అని చెప్పారు. స్త్రీ జాతిని ప్రేమిస్తా.. స్త్రీ జాతిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి అని కాస్త గ్యాప్ ఇచ్చారు.
తన హృదయం చాలా విశాలమైందన్న ఆర్జీవీ.. ఒకే అమ్మాయిని నేను చేసుకోను అని చెప్పేశారు. అందుకే నిన్ను కూడా పెళ్లి చేసుకోనని యాంకర్ పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసేశారు. ఇంతకు ముందు అమ్మాయిలతో ఎఫైర్ సంవత్సరాలు సాగేవని చెప్పిన రాము.. ఆ తరువాత అది నెలలైందని, ఇప్పుడైతే జస్ట్ రెండు మూడు గంటలు మాత్రమే ప్రేమిస్తానంటూ ఓపెన్ గా చెప్పేశారు. అంటే పెళ్లి చేసుకోను గాని.. రెండు మూడు గంటలు రిలేషన్ షిప్ కు మాత్రం రెడీ అని చెప్పకనే చెప్పారు రాంగోపాల్ వర్మ. ఆర్జీవీని ఇంటర్వూ చేసిన యాంకర్ మాత్రం నిరాశలో పడిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.