పూనమ్ కౌర్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై వెలిగినా.. ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లి కాస్త డీలా పడిన మాట వాస్తవమే. కానీ, పూనమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. అలానే తన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా సుమన్ టీవీకి పూనమ్ కౌర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
ఇంటర్వ్యూల్లో భాగంగా ఒక్కో హీరోను చూపించి ఒక్క వర్డ్ లో చెప్పమంటే.. పూనమ్ కౌర్ చెప్పుకుంటూ వచ్చింది. బాలకృష్ణ కనపడగానే మేన్షన్ హౌస్ అని షాకిచ్చింది. పవన్ కల్యాణ్ ఫోటో కనపడగానే కాంట్రవర్సీ అని చెప్పింది. అదేమంటే మీ మీడియా చేసేది అదే కదా అంది. అలా కాదు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెబుతారు అంటే.. పాజిటివ్ చెప్పినా ప్రాబ్లమే.. నెగెటివ్ చెప్పినా ప్రాబ్లమే.. అని.. ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే.. ఎవరికైనా సరే.. చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ పంజాబీ బ్యూటీ ఎలా సిగ్గుపడిందో ఎవరైనా చూడాల్సిందే. మాట కా మాట చెప్పాలి… వయసు పెరుగుతుంటే.. దానితో పాటు పూనమ్ గ్లామర్ కూడా పెరుగుతున్నట్లు ఉంది. సింపుల్ గా ఉన్నా సరే గార్జియస్ బ్యూటీలా కనపడుతూ సూపర్ గా ఉంది. పూనమ్ కౌర్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.