ఫిల్మ్ డెస్క్- ఇక తన జీవితంలోని అత్యంత దుర్బర పరిస్థితుల గురించి స్వయంగా అమితాబ్ చెప్పారు. సుమారు 44 ఏళ్ల తన సినీ కెరీర్‌లో 1999 కాలం గడ్డు కాలంగా నిలిచిందని ఆయన అన్నారు. ఆ సమయంలో తాను స్థాపించిన వెంచర్ దారుణంగా విఫలం కావటంతో 900 కోట్ల అప్పు చేయాల్సొచ్చిందని చెప్పారు. దాని వల్ల వరుస సమస్యలు, అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడే వాళ్లని, కొందరు బెదిరించారు కూడా అని వాపోయారు. ఆ అవమానాలను తట్టుకోవటం చాలా కష్టంగా ఉండేదని ఎమోషనల్ అయ్యారు.
ఈ సమస్యల నుండి అసలు ఎలా బయటపడాలో కూడా అర్ధమయ్యేది కాదని అమితాబ్ చెప్పారు. దాంతో ఒకసారి ప్రొడ్యూసర్ యష్ చోప్రా ఇంటికి వెళ్లి సినిమా ఇవ్వమని అడిగానని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత తనకు తానుగా వెళ్లి సినిమా అవకాశం అడుక్కున్న సందర్భమదని చెప్పారు. అప్పుడు తనకొచ్చిన అదృష్టం మొహొబ్బతే సినిమా ఆఫర్ అని అమితాబ్ తెలిపారు.
మొహెుబ్బతే సినిమాతో తన కెరీర్ మళ్ళీ మలుపు తిరిగిందని అమితాబ్ చెప్పారు. ఆ సినిమా రూపంలో అదృష్టం తిరిగి తన జీవితంలోకి ప్రవేశిచిందని, ఆ తర్వాత ప్రారంభించిన కౌన్ బనేగా కరోడ్‌పతి బాగా సక్సెస్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. ఇక పై అలాంటి పరిస్థితి తనకు, తన కుటుంబానికి రావొద్దని ఇప్పటికీ బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తూన్నానని చెప్పుకొచ్చారు అమితాబ్.