ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.దేశంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు గ్యాప్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం ధరలు పెంచింది. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. నిన్న హైదరాబాద్‌లో పెట్రోలు రూ.109.10, డీజిల్ రూ.95.50గా ఉండగా.. పెరిగిన రెట్లతో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరింది.
ఇక దేశరాజధాని న్యూఢిల్లీ విషయానికి వస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోల్ రూ.97.01, డీజిల్ 88.27గా ఉన్నాయి. కాగా, మంగళవారం.. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసింది. గతంలో కంటే రూ.50 అధికమవడంతో హైదరాబాద్‌లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1002కు చేరింది. మరి.. ఇంధన ధరల పెరుగుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.