టమాటాకు రెక్కలు వచ్చాయి. ధర విషయంలో సామాన్యుడికి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇటు ఉల్లి పాయ ధర కూడా పెరిగేందుకు సిద్ధమౌతుంది. ఇక కూరగాయల ధరలు ఎండాకాలంలో వచ్చే సూర్యరశ్మి వేడికన్నా.. మండిపోతున్నాయి. పోనీ ఇంట్లో ఉన్న సరుకులతో
టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యుడికి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇటు ఉల్లి పాయ ధర కూడా పెరిగేందుకు సిద్ధమౌతుంది. ఇక కూరగాయల ధరలు ఎండాకాలంలో వచ్చే సూర్యరశ్మి వేడికన్నా.. మండిపోతున్నాయి. పోనీ ఇంట్లో ఉన్న సరుకులతో సరిపెట్టేద్దామన్నా అవీ కూడా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి. ఉప్పు నుండి కందిపప్పు వరకు ధరలు పెరుగుతున్నాయి. వీటికి తోడు పాలు, గ్యాస్ ధరలు, అటు బయటకు వెళ్దామంటే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా కొండనెక్కి కూర్చుంటున్నాయి. ఇక వంటింట్లో కాస్త కూర వండుకోవాలన్నా, చారు తాళింపు పెట్టుకునేందుకు నూనె కావాల్సిందే. ఇప్పుడిప్పుడే ఆయిల్ ధరలు తగ్గుతుండగా..ఓ చేదు వార్త వినిపిస్తోంది. మళ్లీ ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గోధుమలు, వంటనూనెలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడమే. అగ్నిలో ఆజ్యంలాగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయడంతో భారత్‌లో సన్ ఫ్లవర్ ఆయిల్ లభ్యత, ధరపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సముద్రం నుండి వస్తువులను ఎగుమతి చేసే ఒప్పందాన్ని రష్యా తిరస్కరించింది. భారత్‌కు పొద్దుతిరుగుడు నూనె రవాణాను ఆకస్మికంగా నిలిపివేసింది. దీని కారణంగా భారత్ లో నూనెల ధరలు పెరిగే అవకావాలున్నాయి. అటు గోధుమ ధరలు కూడా ఒప్పందాన్ని నిలిపి వేయడంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఇది ఇలా ఉంటే..ఆహార మంత్రిత్వ శాఖ, ప్రముఖ వంట నూనె పరిశ్రమ ప్రతినిధులు జూన్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించి, గ్లోబల్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాటి రిటైల్ ధరలను మరింత తగ్గించడంపై చర్చ జరిపారని సమాచారం.