గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. కరోనా కాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మన దగ్గర మాత్రం అలా జరగలేదు. ఇక ఇంధన ధరల పెరుగదల వల్ల.. సామాన్యుల జీవితాలు మరింత భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రతి దాని మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కూరగాయలు మొదలు.. గ్యాస్ సిలిండర్ […]
లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క పైసా తగ్గినా లక్షలు కలిసొచ్చినట్లు మిడిల్ క్లాస్ జీవితాలు అందరివీ. ఒక్క రూపాయి తక్కువకి పెట్రోల్ దొరుకుతుందంటే కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా ఆలోచించకుండా రోజంతా నిలబడగలిగే స్టామినా ఉన్న మనుషులు మిడిల్ క్లాస్ మనుషులు. ఏ హర్ష సాయి లాంటి వ్యక్తో ఉచితంగా పెట్రోల్ కొట్టిస్తుంటే బండ్లు, ఖాళీ టిన్ లు పట్టుకుని ఎగబడి వెళ్లే మనుషులున్న ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయంటే […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నయాలు వెతికే పనిలో ఉన్నాయి కొన్ని దేశాలు. దీనిలో భాగంగా బయో డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో కూడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మన దగ్గర ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ దేశం […]
ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులుపడుతున్న లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం మేర పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 రకం పెట్రోల్ ధర 420 రూపాయలు, డీజిల్ 400 రూపాయలకు చేరింది. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ […]
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజానీకానికి, వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్ పై రూ. 6.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుందని ఆమె తెలిపారు. అలాగే.. ఈ […]
దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర […]
దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం మిగతా అన్నింటి మీద పడి నిత్యవసరాల ధరలు భారీగా పెరిగి.. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.120, డీజిల్ 105కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువే ఉంది. పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలపై […]
దేశంలో పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెట్రోల్ ధరలు భరించలేక లబోదిబోమంటున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. సోమవారం(ఏప్రిల్ 25) స్థానిక శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్‌నాయక్ పుట్టినరోజు కావడంతో.. అక్కడి శివసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీ చేపట్టారు. థానేలోని తత్వజ్ఞాన్ యూనివర్సిటీ సమీపంలో […]
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు నిత్యవసర ధరలు ఆకాశం వైపు చూస్తూంటే.. ఇంధన ధరలు కూడా వీటికి పోటీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కూడా పెరిగాయి. లీటర్ ఇంధనంపై 80 పైసలు చొప్పున పెంచినట్లు ఆయిల్ సంస్థల నోటిఫికేషన్ లో వెల్లడైంది. మార్చి 22 నుంచి ధరలు పెంచడం ప్రారంభమైన తర్వాత ధరలు పెరగడం ఇది […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి 27) లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఐదోసారి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో రాజధాని డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.11, […]