ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో వాయిదా పడ్డ సినిమా షూటింగులన్నీ శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కిటిగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఐతే పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రం ఇంకా చివరి దశ షూటింగ్ లో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య, ఎన్టీఆర్-రాంచరణ్ సినిమా ఆర్ఆర్ఆర్ లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రౌద్రం.. రణం.. రుధిరం. ఆర్ఆర్ఆర్ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అయినా దోస్తీ పాట, మోషన్ పోస్టర్, వర్కింగ్ వీడియోస్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 12న విడుదల చేయనున్నారని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఆచార్య విడుదలపై కూడా చాలా రోజుల నుంచి ఊగిసలాట కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆచార్య ఎప్పుడు విడుదల చేయాలన్నదానిపై కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
ఆచార్య మూవీని ఈ డిసెంబర్ లోనే విడుదల చేయాలని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే డిసెంబర్ 24న ఆచార్య సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇదే జరిగితే జనవరి 12న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు, ఆచార్యకు మధ్య కేవలం 20 రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది. చూడాలి మరి ఏ మేరకు అనుకున్న టైంకు ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదల చేస్తారో.