మాములుగా ఈ రోజుల్లో కులం, మతాలతో సంబంధం లేకుండా యువతి యువకులు ప్రేమించుకుంటుంటారు. ఒకరి భావాలు ఒకరికి నచ్చితే పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటారు. ఇలా ఎంతో మంది పెద్దలను ఎదురించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే దీనిని పక్కనబెడితే.. ఓ యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ ని పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా, చూశారా? కానీ తాజాగా ఓ యువకుడు ఏకంగా ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు ఆ యువకుడు ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్నాడనే పూర్త వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జగిత్యాల పట్టణంలో అర్షద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కారు డ్రైవర్ గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే వీణవంకకు చెందిన దివ్య (ట్రాన్స్ జెండర్) ఇక్కడే నివాసం ఉంటుంది. అయితే ఇక్కడే ఉంటున్న అర్షద్ దివ్యపై మనసుపడ్డాడు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇందు కోసం అనేక సార్లు దివ్య వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ దివ్య మాత్రం అతనితో పెళ్లికి నిరాకరించింది. అలా కొన్నాళ్ల తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయి కరీంనగర్ లోని జమ్మికుంటలో నివాసం ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అర్షద్ ఇటీవల మరోసారి దివ్య వద్దకు వెళ్లాడు. ఇక మరోసారి నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎట్టకేలకు దివ్య అతనితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇంకేముంది.. ఇద్దరూ కలిసి గురువారం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నారు.
అనంతరం అర్షిద్ మాట్లాడుతూ.. నేను గత కొంత కాలం నుంచి దివ్యను ఇష్టపడ్డాను. ఆమెపై ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత దివ్య మాట్లాడుతూ.. అర్షిద్ గత కొంత కాలం నుంచి నా వెంట పడుతున్నాడని, కానీ నేను అతనితో పెళ్లికి అంగీకరించలేదు. ఇక కొంత కాలం తర్వాత నేను ట్రాన్స్ జెండర్ గా మారి ఇప్పుడు పెళ్లి అర్షిద్ ను చేసుకున్నానని తెలిపారు. నాకు జీవితాన్ని ఇచ్చిన అర్షిద్ కు జీవితాంతం రుణపడి ఉంటానని దివ్య తెలిపింది. ఇక వీరి పెళ్లి విషయం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్న యువకుడి ఆలోచన కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 16, 2022