ఈ మద్య కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అయ్యారు.వారిలో యూట్యూబర్ శ్రియా మురళీధర్ కూడా ఒకరు. యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. శ్రియా మురళీధర్ వయసు 27 ఏళ్ళు. అతిచిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవటం అందరిని షాక్ కు గురిచేస్తోంది.
శ్రియా మురళీధర్చి ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డికపూల్. చిన్ననాటి నుంచి నటన అంటే ఆమెకు ప్రాణం. అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా… వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు.
టీవీ హోస్ట్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ ఓ కంటెస్టెంట్. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేశారు. ‘వాట్ ద ఫన్’ యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. శ్రియా మురళీధర్ మృతి పట్ల దీప్తీ సునయన, నటి సురేఖ కుమార్తె సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.