నేటి సోషల్ మీడియా యుగంలో ఒక్కరాత్రిలోనే స్టార్లుగా మారిపోతున్నారు కొంత మంది. తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇక తమలో ఉన్న స్పెషల్ టాలెంట్ ను వాటి ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో ఇండియా నుంచి 22 సంవత్సరాల అపర్ణా టాండలే చోటు దక్కించుకుంది. ఇక అపర్ణ వీడియోస్ లలో పనిమనిషి పాత్రే హైలెట్. ఈ పాత్రలో ఆమె చేసే అల్లరి అంతా.. ఇంతా కాదు.. దాంతో ఈ వీడియోస్ వల్ల అపర్ణకు యూట్యూబ్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది.
అపర్ణా టాండలే.. పూణేకు చెందిన 22 ఏళ్ల సాధారణ యువతి. కానీ అందరిలాగే సాధారణంగా ఆలోచించలేదు.. ఆ ఆలోచనే ఆమెను ఈ రోజు ఓ సెలబ్రిటీగా మన ముందు నిలబెట్టింది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అపర్ణకు.. నటి కావాలనే కోరిక చిన్నతనం నుంచే ఉండేది. దాంతో ఎలాగైనా నటిగా రాణించాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగా 2018 నుంచి యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ మెుదలు పెట్టింది. చిన్నగా వాటిని ఎపిసోడ్ లుగా మలిచి వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. ఈమె చేసిన వీడియోస్ ఎంతగా ఫేమస్ అయ్యయి అంటే.. గత ఏడాది టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ గా యూట్యూబ్ ప్రకటించిన జాబితాలో అపర్ణ చోటు దక్కించుకుంది.
ఇక అపర్ణ చేసే ‘కామ్ వాలీ బాయి’ వీడియోలకు 37 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అపర్ణ చేసిన వీడియోల్లో అత్యధిక ఆదరణ పొందింది.. ‘బారిష్ మే భీగ్ నా’ అనే త్రి మినిట్స్ వీడియో. ఈ వీడియోను 3 కోట్ల మంది వీక్షించారు అంటేనే అపర్ణ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోచ్చు. ఇన్ స్టా గ్రామ్ లోనూ తన వీడియోలను షేర్ చేస్తు.. తన చిలిపి పనిమనిషి పాత్రలో సగటు అభిమానులు అలరిస్తోంది. పని మనిషి పాత్రలకు పెట్టింది పేరుగా అపర్ణ నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. పని మనిషి పాత్రను తీసుకుంటే ఎక్కువ కామెడీని పండించొచ్చు అని చెబుతుంది అపర్ణ. బాధలో ఉన్నవారు సైతం నా వీడియోస్ చూసి నవ్వాలి అదే నా కోరిక అంటుంది అపర్ణ టాండలే. విజయం సాధించాలి అనే తపన ఉంటే.. కష్టాలు, కన్నీళ్లు ఆపవు అని.. ఎలాగైనా కష్టపడి సక్సెస్ అవ్వొచ్చు అనే దానికి అపర్ణా టాండలే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.