అమ్మాయిలు లేదా అబ్బాయిలకు.. తమకు ఇలాంటి పార్ట్ నర్ కావాలని అనుకుని ఉంటారు. అందుకు తగ్గ వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. లేకపోతే వచ్చినవాడిలో మంచిని చూసి అడ్జస్ట్ అయిపోతారు. మరి సాదాసీదాగా ఉండే కుర్రాళ్లకే అమ్మాయిలు పడిపోతున్నారు. మరి హర్షసాయి లాంటి స్టార్ యూట్యూబర్ కి ఇంకెంత మంది పడిపోయుంటారో కదా! అవును హర్షసాయి అనగానే చాలామందికి హెల్ప్ చేస్తాడు.. కుర్రాడు మంచోడు కదా అని అందరూ అనుకుంటున్నారు. కొందరు అమ్మాయిలు మాత్రం.. ఇలాంటి భర్త కావాలని ఒక్కసారైనా అనుకుని ఉంటారు. మరి హర్షసాయికి ఎలాంటి అమ్మాయి కావాలో మీకు తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్షసాయి అందరిలాంటి కుర్రాడే. కానీ నలుగురు చేసే పని తాను చేస్తే ఏం కిక్ ఉంటుంది అనుకున్నాడో ఏమో గానీ యూట్యూబర్ గా మారిపోయాడు. బీటెక్ అయిన తర్వాత ఫిట్ నెస్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అడ్వంచర్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి హెల్పింగ్ వీడియోసే పూర్తిగా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్ లాంటి డీటైల్స్ ని ఎక్కడా రివీల్ చేయలేదు. పలువురు ఫిమేల్ యూట్యూబర్స్ తో కలిసి వీడియోలైతే చేశాడు గానీ తన గురించి పెద్దగా బయటపెట్టలేదు.
ఈ మధ్య కాలంలో యూట్యూబర్ హర్షసాయి వీడియోలపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశాడు. పూసగుచ్చినట్లు ఎక్స్ ప్లయిన్ చేస్తూ మరీ వీడియోస్ పెట్టారు. అదంతా పక్కనబెడితే.. అసలు హర్షసాయి చేస్తున్న సాయం నిజమా? అబద్ధమా అని జర్నలిస్టు జాఫర్.. ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు. ఇందులో భాగంగా హర్షసాయి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మ గురించి తొలిసారి ఈ ఇంటర్వ్యూలోనే బయటపెట్టాడు. ఇక హెల్పింగ్ వీడియోస్, డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి తదితర విషయాలతో చాలా సీరియస్ గా సాగిన ఈ ఇంటర్వ్యూ.. ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నని జాఫర్ అడిగారు. ‘ పెళ్లెప్పుడు? ఎలాంటి అమ్మాయి కావాలి?’ అని హర్షసాయిని అడగ్గా.. వాళ్లు వాళ్లలా ఉండే అమ్మాయి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కాస్త సిగ్గు పడుతూ చెప్పాడు. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరో ఏంటో చూడాలి. మరి హర్షసాయి చెప్పిన అమ్మాయి లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నాయా? మరి ఇంకెందుకు లేటు.. దిగువన కామెంట్ పెట్టి హర్షసాయికి తెలిసేలా చేయండి.