“వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం.. పోయేటప్పుడు ఏదీ తీసుకుని పోము.. ఉన్నంతకాలం హ్యాపీగా బతకాలి. నేను మీలాంటి నార్మల్ వ్యక్తినే.. నా తృప్తి కొద్దీ పేదలకు సాయం చేస్తున్నా..” ఈ మాటలు చెప్తోంది ఎవరో కాదు.. ఆపన్నహస్తం కోసం ఎదుచూసే పేదవారికి తానున్నానంటూ ధైర్యం చెప్పే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి. అందరూ యూట్యూబర్‌లు వ్యూస్ కోసమో.. డబ్బు కోసమో.. పాపులారిటీ కోసమే వీడియోలు చేస్తుంటారు. కానీ ఈ యూట్యూబర్ చాలా ప్రత్యేకం. ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యం. అందుకు తగ్గట్టుగానే ఇతని వీడియోలు ఉంటాయి. సాయం అంటే ఏదో వందో వెయ్యో కాదు.. అవసరాన్ని బట్టి లక్షల్లో సాయం చేస్తుంటాడు.
సంపన్న కుటుంబం నుంచి వచ్చిన హర్ష సాయి.. చిన్న చిన్న గేమ్‌లు పెట్టి పేదవాళ్లని ధనవంతులుగా చేస్తుంటాడు. వాళ్లు ఊహించని రీతిలో సాయం చేస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇప్పటికే వందల కుటుంబాలకు సాయం చేసిన హర్ష సాయి త్వరలో మరింత మందికి సాయం చేయబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో.. భారతదేశంలో నెంబర్ 1 యూట్యూబర్ గా అవ్వడమే కాకుండా.. హర్ష సాయి అంటేనే ఒక ఇన్స్పిరేషన్ లా భావించాలని తెలిపాడు. దేశంలో ఉన్న పేదవారిలో 50 శాతం మందికి సాయం చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు.
ఇది కూడా చదవండి: Youtuber Harsha Sai: వీడియో వైరల్! బార్బర్ ని మిలియనీర్‌గా మార్చిన యూట్యూబర్!
అసలు పాతికేళ్ల కుర్రాడికి.. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందనేగా.. మీ డౌట్? సాయం చేయడంలో మనోడు దానకర్ణుడు లెక్క. అదే అతన్ని ఈ స్థాయిలో నిలిపింది. తన ఫాలోవర్స్ కోసం లక్షలు ఖర్చుచేసి ఫ్రీ పెట్రోల్ బంక్‌లను నిర్వహించడం. చిన్న చిన్న గుడిసెలలోకి వెళ్లి వాళ్లు జీవితంలో చూడలేనంత డబ్బుని చేతిలో పెట్టి వాళ్ల కళ్లలో ఆనందాన్ని చూడటం. రోడ్లపై చిన్న చిన్న పనులు చేసే వాళ్లకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం. ఇలా లక్షల ఖర్చుతో వీడియోలు చేసి తన ‘Harsha Sai – For You Telugu’ ఛానల్‌లో అప్ లోడ్ చేస్తుంటాడు. మనోడు అలా వీడియో అప్ లోడ్ చేశాడో లేదో.. మిలియన్ల వ్యూస్ వచ్చిపడుతుంటాయి. ఆ వచ్చిన డబ్బునే రొటేషన్ పద్దతిలో ఖర్చు చేస్తుంటాడు. ఎవరికైనా తన సాయం కావాలనిపిస్తే 09502600756 నెంబర్‌కి కాల్ చేయొచ్చని తన నెంబర్‌ని సైతం అందుబాటులో ఉంచాడు.
హర్ష సాయి చేస్తున్న మంచి పనులకు మంచి పేరు వస్తుండటంతో వాళ్ల పేరెంట్స్ కూడా అడ్డు చెప్పలేదు. హర్ష సాయి పుట్టినూరు ఏపీలో విజయనగరం. పెరిగింది మాత్రం.. హైదరాబాద్‌లో. బీటెక్ కంప్యూటర్స్ సైన్స్ కంప్లీట్ చేశాడు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. చిన్నప్పటి నుంచి తనకి నచ్చిన పనిచేయడాన్ని ఇష్టపడతాడు. దీంతో తన ఫోకస్ యూట్యూబ్ వీడియోలపై పెట్టాడు. మొదట్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇష్టపడే హర్ష సాయి వాటిపై ప్రయోగాత్మక వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. మరి.. దేశంలో ఉన్న పేదవారిలో 50 శాతం మందికి సాయం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్న హర్ష సాయిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.