యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు హర్షసాయి వీడియోస్ మనకు కనిపిస్తుంటాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ తో అవి ట్రెండింగ్ లో దూసుకుపోతుంటాయి. మనలో చాలామంది హర్షసాయి వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటాం కూడా. అంతలా పాపులర్ అయిన హర్షసాయిని అభిమానించే వారు లక్షలు కోట్లలో ఉన్నారు. కానీ వాళ్లలో దాదాపు ఎవ్వరికీ కూడా హర్షసాయి అనే పేరు తప్పించి.. అతడి గురించి మిగతా ఎలాంటి డీటైల్స్ కూడా తెలియవు. చెప్పాలంటే అతడు తెలియనివ్వడు. అలాంటి హర్షసాయి.. ఫస్ట్ టైమ్ తన ఫ్యామిలీ గురించి బయటపెట్టాడు. అమ్మ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్షసాయి వీడియోల్లో మీరు ఏ ఒక్కటి చూసినా సరే కచ్చితంగా ఫిదా అవుతారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత ఎంగేజింగ్ గా ఉండే వీడియోస్.. మనం కూడా సాయం చేయాలనే తపన కలిగిస్తాయి. ఈ వీడియోలతో స్పూర్తి పొంది, ఎవరికీ తోచిన సాయం వారు చేస్తున్నారు! కాకపోతే అలాంటివి ఏవి బయటకు రావు. ఇకపోతే బీటెక్ పూర్తి చేసిన తర్వాత అందరిలానే జాబ్ చేయకుండా.. హర్షసాయి సొంత యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. ఫిట్ నెస్, అడ్వంచర్ వీడియోస్ చేస్తూ వ్యూయర్స్ ని అట్రాక్ట్ చేశాడు. అందరిలా తాను చేస్తే కిక్ ఏముందని అనుకున్నాడో ఏమో గానీ.. వేలు, లక్షలు డబ్బుల్ని ఫ్రీగా పంచిపెడుతూ వార్తల్లో నిలిచాడు. ఆ వీడియోలు.. రాకెట్స్ లా దూసుకెళ్లాయి.
సరే ఇదంతా పక్కనబెడితే.. స్టార్ హీరోల రేంజ్ లో ఫేమస్ అయిన హర్షసాయి గురించి అతడి పేరు తప్పించి ఒక్కటంటే ఒక్క విషయం కూడా ఎవరికీ తెలీదు. చెప్పాలంటే అతడి తెలియనివ్వలేదు. ఇక హర్షసాయి తల్లిదండ్రులు పేర్లు కూడా ఏం బయటకు రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్.. ‘ఆపరేషన్ హర్షసాయి’ పేరిట ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన జర్నలిస్ట్ జాఫర్.. హర్షసాయిని ఇంటర్వ్యూ కూడా చేశాడు. దాదాపు 32 నిమిషాలున్న ఈ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. కానీ ఒక్క ప్రశ్న విషయంలో మాత్రం హర్షసాయి ఎమోషనల్ అయ్యాడు. అదే అమ్మ గురించి చెప్పినప్పుడు. ఎందుకంటే అమ్మ అనేది ప్రతి ఒక్కరికీ ఉండే కామన్ ఎమోషన్. ఆమె కళ్లలో ఆనందం చూడటం కోసం మనం ఏమైనా చేస్తాం.
కానీ ఎంతోమంది అమ్మలకు సాయం చేస్తున్నా హర్షసాయికి మాత్రం అమ్మ లేదు. అతడు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే చనిపోయింది. ఈ విషయాన్ని హర్షసాయినే స్వయంగా చెప్పాడు. ‘మా అమ్మ పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అందుకే నా పేరు హర్షసాయి అని పెట్టారు. బాలవికాస్ క్లాసులు ఆమె చెబుతున్నప్పుడు మిగతా పిల్లలతోపాటు నేను కూడా ఆ తరగతులు విన్నాను. జీవితం అంటే ఎప్పుడూ కూడా ఏదో పర్పస్ ఉండాలని అమ్మ చెప్పేవారు. కానీ నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే అమ్మ చనిపోయారు. బహుశా ఆమె మాటలే.. నా వీడియోలకు ఇన్సిపిరేషన్ అయ్యుండొచ్చు’ అని హర్షసాయి ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని హర్షసాయి చెబుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న జర్నలిస్ట్ జాఫర్ కూడా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆయన కళ్లలోనూ సన్నని కన్నీటి పొర కనిపించింది. మరి అమ్మ గురించి తొలిసారి హర్షసాయి మాట్లాడటం, ఆమె మరణం గురించి చెప్పి ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.