Harsha Sai: ఇటీవల సోషల్ మీడియాలో మోడల్ కాజల్ అలియాస్ జుబేదా ఫాతిమా అనే మహిళ తెగవైరల్ అవుతోంది. చాలా పేదరికంలో ఉన్న కాజల్ ఆమె తల్లితో ఉంటుంది. తినడానికి తిండిలేక, సరైన ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న కాజల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే.. కొద్దిరోజులుగా మోడల్ కాజల్ ని పలువురు యూట్యూబర్లు ఇంటర్వ్యూలు చేసి.. ఆమె పరిస్థితి, జీవితం ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయో బయటపెడుతూ వచ్చారు. మరికొందరు ఆమెకు చేతనైన సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ‘ఫేస్ బుక్ స్టార్ ఆశ’ అనే యూట్యూబర్.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి వీరాభిమాని. తన చేయిపై హర్షసాయి టాటూ కూడా వేయించుకున్నాడు. ఎలాగైనా హర్షసాయిని కలిసి మోడల్ కాజల్ కి ఎంతోకొంత సాయం చేయాలని భావించాడు. ఎట్టకేలకు హర్షసాయిని కలిసి మాట్లాడాడు. ఇతని అభిమానాన్ని చూసిన హర్షసాయి.. నీకోసం ఏం చేయమంటావ్? అని అడగ్గా.. ‘నాకేం వద్దు. మోడల్ కాజల్ అని ఓ మహిళ చాలా కష్టాల్లో ఉంది. ఆమెకు ఏదైనా సాయం చేయండి’ అని హర్షసాయిని అడిగాడు.
ఇక యూట్యూబ్ లో రియల్ శ్రీమంతుడు అనిపించుకున్న హర్షసాయి.. మోడల్ కాజల్ కి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయిపోయాడు. వెంటనే తన టీంతో వెళ్లి తనదైన స్టైల్ లో కాజల్ కి లక్ష రూపాయలు అందజేసి.. తన మంచి మనసు చాటుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత.. హర్షసాయి ద్వారా కాజల్ కి సాయం ఇప్పించిన ఫేస్ బుక్ స్టార్.. కాజల్ ఇంటికి వెళ్లి ఆ లక్ష రూపాయలను అడిగినట్లు తెలుస్తుంది.
ఈ విషయం తెలుసుకున్నాను విజ్జు గౌడ్ అనే మరో యూట్యూబర్.. హర్షసాయి ద్వారా కాజల్ కి లక్ష రూపాయల సాయం అనేది స్కామ్ అని.. కాజల్ నుండి ఫేస్ బుక్ స్టార్ లక్ష రూపాయలు తీసుకోవాలని ట్రై చేశాడని.. ఆ టైంలో ఇమ్రాన్ అనే వ్యక్తి అడ్డుపడటంతో ఫేస్ బుక్ స్టార్ అక్కడినుండి వెళ్లిపోయాడని.. ఇదంతా కాజల్ ని అడ్డుపెట్టుకొని హర్షసాయి నుండి ఫేస్ బుక్ స్టార్ డబ్బులు కొట్టేసే ప్లాన్ అంటూ నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ వీడియో చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు.
ఇక ఈ విషయం ఫేస్ బుక్ స్టార్ కి తెలియడంతో.. కాజల్ ని కలిసి లక్ష రూపాయలు అడిగిన మాట వాస్తవమేనని.. కానీ తన ఉద్దేశం ఆమె వద్ద నుండి లక్ష కొట్టేయాలని కాదని.. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేనందున ఆ డబ్బులో ముందుగా ఆమె ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనిచ్చి, ఆ తర్వాత ఆమెతో హర్షసాయి పేరుమీద ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దామని.. అడిగినట్లు వివరణ ఇచ్చాడు. అలాగే ఇమ్రాన్ అనే వ్యక్తి కాజల్ వాళ్ళ అవసరాలను చూసుకుంటామని చెప్పగానే అక్కడినుండి వచ్చేశానని తెలిపాడు. తనను పూర్తిగా నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారని, సాయం చేశాక మళ్లీ కాజల్ నుండి డబ్బులు ఎలా తీసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ స్టార్ క్లారిటీ ఇవ్వడంతో విజ్జు గౌడ్ అనే యూట్యూబర్.. ‘లక్ష రూపాయల స్కామ్’ అంటూ చేసిన వీడియోను ప్రైవేట్ చేశాడు. ఇదంతా మిస్ కమ్యూనికేషన్(అపార్థం) కారణంగానే ఇష్యూ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రముఖ యూట్యూబర్ మహీధర్ కూడా తన వీడియోలో తెలియజేశారు. ప్రస్తుతం మోడల్ కాజల్ కి హర్షసాయి లక్ష రూపాయలు సాయం చేసిన వీడియో ట్రెండ్ అవుతుండగా.. మరోవైపు ఇదంతా ఫేస్ బుక్ స్టార్ స్కామ్ అంటూ మరో ఇష్యూ వైరల్ అయ్యింది. మొత్తానికి ఈ విధంగా మోడల్ కాజల్ లక్ష రూపాయల సాయం పొందింది. ఇదిలా ఉండగా.. ఫాతిమాకి హీరోయిన్ కాజల్ అంటే ఇష్టమని.. అందుకే ఆమె పేరును మోడల్ కాజల్ గా మార్చుకుందని సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.