యూట్యూబర్ హర్షసాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చాలా ఫేమస్. ఎంతలా అంటే ఇతడి గురించి తెలియని వారు ఉండరేమో బహుశా! స్టార్ హీరోల రేంజ్ లో ఫేమ్ సంపాదించాడు. ప్రతిరోజూ కూడా కోట్లాదిమంది ఇతడి వీడియోస్ చూస్తుంటారు. ఇక పక్కవాళ్ల గురించి పట్టించుకోవడమే కరువైన ఈ రోజుల్లో… నేనున్నానంటూ హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయాడు. తనకు తోచిన సాయం చేస్తూ ఎప్పటికప్పుడు న్యూస్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. అలాంటి హర్షసాయి గురించి గత కొద్దిరోజుల నుంచి ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. హర్షసాయి నిజంగా హెల్ప్ చేస్తున్నాడా? లేదా వీడియోల వ్యూస్ కోసమేనా ఇలా చేసేది అని ఓ ప్రశ్న చాలామందికి వచ్చింది. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం దొరికింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్షసాయి అనేవాడు మనలాంటి ఓ కుర్రాడు. మిగతావాళ్లలా ఏదో ఓ ఉద్యోగం చేసుకోకుండా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. మొదట్లో ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియోలు చేసేవాడు. హర్షసాయి వాయిస్ డిఫరెంట్ గా ఉండటంతో వ్యూయర్స్ ఆ వీడియోలకు ఎట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఓ రాత్రంతా అడవిలో ఉండటం, టీ తాగడం కోసం వేల అడుగుల కొండ ఎక్కడం లాంటి అడ్వంచర్ వీడియోలు చేశాడు. ఒకానొక సందర్భంలో ఈ వీడియోలని పక్కనబెట్టి, పేదలు-ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలని ఫిక్సయ్యాడు. అలా అప్పటినుంచి తనకు తోచినట్లు డబ్బులు, ఇంటికి కావాల్సిన వస్తువులు లైక్.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ లాంటివి ఇచ్చేవాడు.
యూట్యూబర్ హర్షసాయి.. మొన్నటికి మొన్న ఓ బార్బర్ కి ఏకంగా ఇల్లు కట్టించి ఇచ్చాడు. ఏకంగా పేదల్ని.. అత్యంత ఖరీదైన ఫలక్ నుమా ప్యాలెస్ కి తీసుకెళ్లి మరీ భోజనం పెట్టించాడు. ఓ రోజంతా ఫ్రీ పెట్రోల్ ఇచ్చాడు. ఇంతలా పాపులర్ అయిన హర్షసాయిపై ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కొంతమేర నెగిటివిటి పెరిగింది. ఓ యూట్యబర్.. హర్షసాయి బండారం ఇదేనని బయటపెట్టాడు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. హర్షసాయి ఫేక్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశాడు. కానీ అవేవి నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే జర్నలిస్టు జాఫర్.. ‘ఆపరేషన్ హర్షసాయి’ పేరిట ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. హర్షసాయి ద్వారా సాయం పొందిన వారి దగ్గరకు నేరుగా వెళ్లి కలిశారు. హర్షసాయి నిజంగా డబ్బులిచ్చాడా లేదా అని కూడా అడిగి తెలుసుకున్నారు. సంచలన విషయాలు బయటపెట్టారు. కట్ చేస్తే.. హర్షసాయి సాయం పొందిన ప్రతి వ్యక్తి కూడా.. అతడు నిజంగానే డబ్బులు, వస్తువులు ఇచ్చాడని పూస గుచ్చినట్లు చెప్పారు. దీంతో హర్షసాయి.. మిగతా యూట్యూబర్స్ అనుకుంటున్నట్లు ఫేక్ కాదు నిజమేనని తేలింది. సో అదీ విషయం. మరి హర్షసాయి వీడియోస్, అతడు చేస్తున్న సాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.