యూట్యూబర్ హర్షసాయి వీడియోస్ మీలో ఎంతమంది చూస్తారు? అని అడిగితే.. తెలుగు రాష్ట్రాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మేం చూస్తాం మేం చూస్తాం అనే చెబుతారు. కుర్రాడైనా సరే భలే హెల్ప్ చేస్తున్నాడు కదా అని హర్షసాయి కచ్చితంగా మెచ్చుకుంటారు. అలా వీడియో చూస్తున్న టైంలో కనీసం ఒక్కసారైనా అనుకుని ఉంటారు! హర్షసాయి ఏదో చిన్న చిన్న సాయాలు చేస్తున్నాడంటే అది కూడా కాదు. జస్ట్ షూ పాలిష్ చేసినందుకు రూ.20 వేలు ఇస్తాడు. కటింగ్ చేసుకున్నందుకు ఓ బార్బర్ కి ఏకంగా ఇల్లు కట్టించి ఇస్తాడు. ఇలా వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు మీతో పాటు చాలామందికి వచ్చే వన్ అండ్ ఓన్లీ డౌట్.. అసలు హర్షసాయికి ఇంత డబ్బు ఎలా వస్తోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్షసాయి పేరు చెబితే చాలామంది పులకరించిపోతారు. తాము చేయలేకపోయిన ఓ పనిని.. పాతికేళ్ల కుర్రాడు అవలీలగా చేస్తున్నాడని. అందరిలానే ఇంజినీరింగ్ పూర్తి చేసిన హర్షసాయి.. ఏదో ఉద్యోగంలో జాయిన్ కాలేదు. కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. కుర్రాడు కదా ఫిట్ నెస్ పై స్టార్టింగ్ లో వీడియోస్ చేశాడు. డిఫరెంట్ వాయిస్ తో ఉన్న ఈ వీడియోలకు వ్యూస్ బాగానే వచ్చేవి. ఆ తర్వాత అడ్వంచర్ వీడియోస్ చేశాడు. ఇవన్నీ చేసి బోర్ కొట్టిందో ఏమో గానీ పేదలకు హెల్ప్ చేయాలని ఫిక్సయ్యాడు. అందుకోసం సొంతంగా ఓ టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. బాగా ఇబ్బందుల్లో ఎవరున్నారో తెలుసుకుని సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలని కూడా ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ లో పోస్ట్ చేస్తూ వచ్చాడు.
ఇంతలా పాపులర్ అయిన హర్షసాయి సాయం చేస్తున్నాడు అని తప్పించి, అసలు ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటి అని ఎవరికీ తెలీదు. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ లో తప్పించి, ఎక్కడా ఎవరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ జర్నలిస్టు జాఫర్ కి హర్షసాయి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన చేసిన ‘ఆపరేషన్ హర్షసాయి’ తర్వాత హర్షసాయిని పలు ప్రశ్నలు అడిగారు. అసలు ఇన్నన్నీ డబ్బులు పంచిపెడుతున్నావ్ కదా ఎలా వచ్చాయి? అని హర్షసాయిని అడిగారు. యూట్యూబ్ ఛానెల్ పెట్టిన కొత్తలో తక్కున రాబడి వచ్చేదని, దాంతో తనకు తోచిన హెల్ప్ చేసేవాడినని హర్షసాయి అన్నాడు. అప్పుడు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు పలు భాషల్లో ఛానెల్స్ ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే చాలా డబ్బు వస్తుందని హర్షసాయి చెప్పాడు. ఆ డబ్బునే సాయం కోసం ఉపయోగిస్తున్నానని అన్నాడు. దీంతో వ్యూయర్స్ వచ్చిన అతిపెద్ద డౌట్ పై క్లారిటీ వచ్చేసింది. తనకు కంపెనీలు లాంటివి ఏం లేవని చెప్పిన హర్షసాయి.. భవిష్యత్తులో చేసే వీడియోస్ కోసం బహుశా.. ఏదైనా కంపెనీ ప్రారంభించొచ్చని చెప్పాడు. మరి హర్షసాయి చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.