విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. తన నటన, మాస్ డైలాగ్ లతో కోట్లాది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తను నటించిన కొన్ని సినిమాల్లో ఆడవారిపై జరిగే అన్యాయాలను దాడులను ఎదిరించి మహిళల గౌరవాన్ని కాపాడే సన్నివేశాలను మనం చూడవచ్చు. రియల్ లైఫ్ లో కూడా యంగ్ టైగర్ మహిళలను ఎంతో గౌరవిస్తారు. ఈ క్రంలో తెలంగాణ షీ టీమ్స్ మహిళన రక్షణార్థం ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో మహిళలపై ప్రేమ పేరుతో వరకట్న వేధింపులతో ఇతరత్రా కారణాలతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటకి ఆకతాయిలు మారడం లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం రాష్ట్ర హోం శాఖ ఉమెన్స్ వింగ్, సఖి. భరోసా సెంటర్, షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా యువతులు, మహిళలు ఆకతాయిన వేధింపుల నుంచి రక్షించబడుతారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఈవ్ టీజింగ్ తగ్గింది. షీ టీంల ఏర్పాటుతో పలు రకాల ఆఫీసుల్లో, బస్టాండుల్లో, బస్సుల్లో, కాళాశాలల్లో మహిళలపై జరిగే దాడులను అరికట్టగలిగారు.
అయితే ఇంకా మహిళల్లో యువతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వార్యంలో షీ టీంను అనుసరించాలని తెలిపే ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని ‘ఫాలో.. ఫాలో’ అనే సాంగ్ ను పోస్ట్ చేసి షీ టీమ్ ను ఫాలో కావాలని కోరారు. దీనికి సంబంధించి జస్ట్ ఎ జెంటిల్ రిమైండర్! @టిఎస్ షీ టీమ్స్ ఆర్ వాచింగ్ యూ! అంటూ వెల్లడించారు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అయ్యింది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోయారు.