ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు బప్పీ లహరి మరణించారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించాడు. OSA (అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కారణంగా అర్ధరాత్రి వేళ ఆయన తుది శ్వాస విడిచారు.. అని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నంజోషి చెప్పారు. అయితే ఓఎస్ఏ గురించి ఎక్కువ మందికి తెలియదు. స్లీప్ అప్నియాలోనే పలు రకాలు ఉన్నాయి.
అసలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)అంటే ఏమిటి?
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనేది అత్యంత సాధారణ నిద్ర సంబంధిత శ్వాస రుగ్మత. ఇది నిద్రపోతున్నప్పుడు పదేపదే ఆగి శ్వాసను ప్రారంభించేలా చేస్తుంది. స్లీప్ అప్నియాలో అనేక రకాలు ఉన్నాయి, అయితే అత్యంత సాధారణమైనది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. నిద్రలో మీ గొంతు కండరాలు అడపాదడపా విశ్రాంతి తీసుకొని మీ వాయుమార్గాన్ని నిరోధించినప్పుడు ఈ రకమైన అప్నియా సంభవిస్తుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా యొక్క గుర్తించదగిన సంకేతం గురక. నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ కు గురి అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊరితి తిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. ఆ సమయంలో ఒళ్లు ఝలధరించినట్లుగా ఒక రకం చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు.
ఇది చదవండి: జూనియర్ యన్టీఆర్ సినిమా సీన్ రిపీట్! పాపం రైతు డబ్బంతా..!
ఈ సమస్య ఉన్న వారు సరిగా నిద్ర పోలేరు. ఇది దీర్ఘకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డు పడుతుంది. కండరాలు సడలించినప్పుడు, మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ వాయుమార్గం ఇరుకైనది లేదా మూసివేయబడుతుంది, 10 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మీ శ్వాసను అడ్డుకుంటుంది. ఇది మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడటానికి కారణమవుతుంది.
స్థూలకాయం, టాన్సిల్స్ వాపునకు గురికావడం, ఎండోక్రైన్ డిజార్డర్లు, హర్ట్ ఎటాక్ రావడం లాంటి సమస్యలున్న వారికి ఓఎస్ఏ ఎదురవుతుంది. పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి. అయితే ఈ సమస్య పగటి పూట ఎక్కువ నిద్ర పోయే వారికి ఉంటుంది. ఓఎస్ఏలో శ్వాసనాళాల ఎగువ భాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు ఇస్తుంటుంది. కానీ, స్లీప్ అప్నియా లేదా సెంట్రల్ స్లీప్ అప్నియాలో మెదడు సంకేతాలు ఇవ్వలేదు. దీని ప్రభావంతో మధ్య మధ్యలో శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఇదే ప్రాణాలకు ముప్పు తెస్తుంది.
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ వాయుమార్గాన్ని తెరిచి ఉంచడానికి సానుకూల ఒత్తిడిని ఉపయోగించే పరికరాన్ని ఉపయోగించడం ఒక చికిత్స. తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. ఈ పరికరాలు డాక్టర్లు సూచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా చేయాల్సి వస్తుంది. స్లీప్ అప్నియా సమస్యలున్న వారు జీవిత కాలాన్ని 12-15 ఏళ్లపాటు తగ్గిస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం మంచిది.