ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు బప్పీ లహరి మరణించారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించాడు. OSA (అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కారణంగా అర్ధరాత్రి వేళ ఆయన తుది శ్వాస విడిచారు.. అని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నంజోషి చెప్పారు. అయితే ఓఎస్ఏ గురించి ఎక్కువ మందికి తెలియదు. […]