సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మద్యనే బాలీవుడ్ లో లెజండ్రీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆ విషాదం మరువక ముందు ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పీ లహరి కన్నుమూశారు. ముంబై లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గుడిలో 1953లో జన్మించారు. పలు భాషల్లో సూపర్ హిట్ మూవీలకు సంగీతం అందించారు.
హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతమును పరిచయము చేసిన ఘనత ఇతడిదే. ఈయన కొన్ని తెలుగు లో సింహాసనం,సామ్రాట్,గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. బప్పీలహరి ఆత్మకు శాంతి చేకూరలని సినీ సెలబ్రీటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Singer-composer Bappi Lahiri dies in Mumbai hospital, says doctor
— Press Trust of India (@PTI_News) February 16, 2022