ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూశారు. ఇటీవలి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూయగా.. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగులో పలు సినిమాలకు సంగీతం అందించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘సింహాసనం’ సినిమాతో బప్పి లహిరి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్న టాప్ హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందించారు.
ఇది చదవండి: ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఏకంగా 43 వేల కోట్లు
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో మొత్తం నాలుగు సినిమాలకు బప్పి లహిరి మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలిగిపోతున్న బప్పి లహిరి అంటే మెగాస్టార్ చిరంజీవికి వల్లమాలిన అభిమానం. టాలీవుడ్ లో మెగాస్టార్- బప్పి లహిరి కాంబినేషన్ లో వచ్చిన ఈ నాలుగు సినిమాల్లో 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే. ఈ మూవీస్ షూటింగ్ సమయంలో బప్పి తో చిరంజీవి ఎంతో స్నేహపూర్వకంగా ఉండవారని టాలీవుడ్ టాక్. ‘సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి మృతికి చిరంజీవి సంతాపం… బప్పి లహిరి కన్నుమూత తీవ్ర ఆవేదనను కలిగించిందన్న చిరంజీవి… తన సినిమాలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి సూపర్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటు తీర్చలేదనిదని’ అంటూ చిరు ట్విట్ చేశారు. బప్పి లహిరి మృతిపై చిరంజీవి అభిమానులు కూడా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. నీవు లేకపోయినా నీ పాట నిలిచే ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022
స్టేట్ రౌడీ : అరె మూతిమీద మీసమున్న, తదిగిన తోం, రాధా రాధా మదిలోన మన్మధ బాధ, చుక్కల పల్లకిలో, వన్ టూ త్రీ పాటలు.. ఎప్పటికీ టాలీవుడ్ టాప్ లో ఉండిపోతాయి.
గ్యాంగ్ లీడర్ : భద్రాచలం కొండా సీతమ్మ వారి దండ, వానా వాన వెల్లువాయె, వయసు వయసు వయసు, పని సాససా, పాపా రీటా, పాల బుగ్గ పాటలు పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి.
రౌడీ అల్లుడు : అమలాపురం బుల్లోడా, చిలుకా క్షేమమా, కోరి కోరి కాలుతుంది ఈడు, లవ్ మీ మై హీరో, ప్రేమ గీమ తస్సాదియ్యా, స్లోలీ స్లోలీ, తద్దినకా.. తప్పదికా పాటలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్.
బిగ్ బాస్: మావా మావా, ఉరుమొచ్చేసిందోయ్, నీ లాంటి రేవునోనా, నంబర్ 1, 2, సూదికి దారం పాటలు దుమ్మురేపాయి.