భీమినేని విష్ణుప్రియ.. ఈ భామకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ట్రోలింగ్ చేసిన వాళ్లే ఇప్పుడు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ జోరు పెంచేసింది. సినిమాల్లో కూడా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. వాంటెడ్ పండుగాడు సినిమాతో నటిగా తన కెరీర్ లో తొలి అడుగుపడింది. అక్కడి నుంచి తన వెండితెర ప్రస్థానం మరింత వేగం పుంజుకోవాలంటూ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడికి హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. దానిని మరింత పెంచుకునేందుకు విష్ణుప్రియ ఫొటోషూట్లు, రీల్స్ అంటూ నానా హంగామా చేస్తుంటుంది. ఇటీవల మానస్ నాగులపల్లితో కలిసి ఓ కవర్ సాంగ్ కూడా చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఆ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. ఇంక ఘాటు ఫొటోషుట్లతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పకనే చెప్తూ ఉంటుంది. గ్లామర్ డోస్ ఎప్పుడో పెంచేసిన ఈ భామ అందాల విందుకు హద్దులు ఎప్పుడో చెరిపేసింది.
తాజాగా గ్రీన్ డ్రెస్ వేసుకుని హాటు ఫొటో షూట్ చేసిన విష్ణుప్రియ.. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇటీవల తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఆమె ఖాతాలో న్యూ*డ్ చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేశారు. తర్వాత అతి కష్టం మీద తన ఖాతాను రికవర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంక విష్ణుప్రియ కెరీర్ ను పరుగులు పెట్టించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు నటిగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్ గా దూసుకుపోతోంది.