'విరూపాక్ష'లో చేసింది చిన్న రోల్ అయినా.. పాపులారిటీ మాత్రం చాలా తెచ్చుకుంది. ఆమెనే సోనియా సింగ్. ఆమె చేసిన బెస్ట్ 10 షార్ట్స్ ఫిల్మ్స్ గురించే ఈ స్టోరీ.
మీరు ‘విరూపాక్ష’ మూవీ చూసుంటే హీరోహీరోయిన్లు కాకుండా ఓ అమ్మాయి మిమ్మల్ని చాలా ఎట్రాక్ట్ చేసుంటుంది. ఆమె చేసింది చిన్న పాత్రే కానీ స్టోరీలో చాలా కీలకం. యస్ మీరు అనుకున్నది కరెక్టే. మేం చెబుతున్నది సోనియా సింగ్ గురించే. ఇక్కడమ్మాయి కాకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమా వల్ల ఆమెకి క్రేజ్ వచ్చిందని చాలామంది అనుకుంటారేమో. అస్సలు కాదు. దాదాపు నాలుగేళ్ల క్రితమే యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి యమ క్రేజ్ తెచ్చుకుంది. సరే వాటన్నింటి గురించి చెప్పంలే గానీ సోనియా యాక్ట్ చేసిన 10 బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ గురించి ఇందులో మాట్లాడుకుందాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సోనియా సింగ్ యాక్ట్ చేసిన వాటిలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన షార్ట్ ఫిల్మ్ ‘షీ అండ్ పీరియడ్స్’. ఓ భార్యకి పీరియడ్స్ వచ్చిన టైంలో ఆమె భర్త ఎలాంటి కేరింగ్ తీసుకున్నాడు. చివరకు ఏమైంది అనేది ఇందులో చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ కి ఏకంగా 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ‘నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్’ అనే మరో షార్ట్ ఫిల్మ్.. సోనియా లో చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఓ తెలుగు రానీ అమ్మాయి వల్ల ఓ అబ్బాయి ఎన్ని పాట్లు పడ్డాడనేది దీని స్టోరీ
సోనియా షార్ట్ ఫిల్మ్స్ తోపాటు యూట్యూబ్ లోనే వెబ్ సిరీసులు కూడా చేసింది. రెండేళ్ల క్రితం ‘పెళ్లైన కొత్తలో’ అని ఓ సిరీస్ చేసింది. రెండు సీజన్లుగా వచ్చిన ఇది సోనియాకి విపరీతమైన క్రేజ్ తీసుకురావడంలో చాలా అంటే చాలా ఉపయోగపడింది. ఇందులో సోనియాకు జోడీగా చేసిన పవన్ సిద్ధు కూడా చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ జోడీగా చేసిన మరో సిరీస్ ‘అనసూయ రామలింగం’. ఓ మాస్ కుర్రాడు, ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీ ఇది. వ్యూస్ పరంగానే కాదు సోనియా క్రేజ్ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడింది.
షార్ట్ ఫిల్మ్స్ అనగానే చాలామంది ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్లు తీస్తుంటారు. వాటిని వింటేజ్ స్టోరీలతోనూ తీయొచ్చని ప్రూవ్ చేసింది ‘సుజాత సుబ్రహ్మణ్యం’. ఇందులో క్యూట్ పెయిర్ గా సోనియా-పవన్ సిద్ధు నటించారు. మ్యారేజ్ అయిన ఓ జోడీ స్టోరీని ఇందులో చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్ తర్వాత సోనియా యాక్ట్ చేసిన సింపుల్ అండ్ క్యూట్ సిరీస్ ‘ప్రేమలేఖ’. ప్రేమని బేస్ చేసుకుని తీసిన ఈ షార్ట్ ఫిల్మ్(సిరీస్) నెటిజన్స్ ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. చెప్పాలంటే సోనియా క్రేజ్ పెరగడానికి ఇవి సహాయపడ్డాయి.
లవ్ అంటే ఎప్పుడూ హ్యాపీస్ మాత్రమే కాదు అప్పుడప్పుడు బాధలు కూడా ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ తో తీసిన సిరీస్ ‘నీవే’. ఆరు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్.. సోనియా ఫ్యాన్స్ ని భలే ఎంటర్ టైన్ చేసింది. ఇందులోనూ పవన్ సిద్ధునే ఈమెకు జోడీగా చేయడం విశేషం. దీని తర్వాత సోనియా చేసిన మరో బెస్ట్ వెబ్ సిరీస్ అంటే ‘అమ్మ ఆనంద్ ఆవకాయ్’. ప్యూర్ నేటివిటీ టచ్ తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్(సిరీస్).. వ్యూయర్స్ ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. ఇందులో మొత్తం 11 ఎపిసోడ్స్ ఉన్నాయండోయ్
ఓవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న సోనియా ప్రస్తుతం చేస్తున్న సిరీస్ అంటే ‘అలివేలు శ్రీనివాసులు’. ఫన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఇందులో నుంచి ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్ వచ్చాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి. ఇక యూట్యూబ్ లోకి వచ్చిన కొత్తలో సోనియా చేసిన ‘మెడికో గర్ల్ ఫ్రెండ్’ కూడా బాగానే ఎంటర్ టైన్ చేసింది. ఇలా షార్ట్ ఫిల్మ్స్ తో చాలా క్రేజ్ తెచ్చుకున్న సోనియా.. ‘విరూపాక్ష’ పాపులర్ బాగానే అయిపోయింది. మరి భవిష్యత్తులో రెండింటిలోనూ యాక్ట్ చేస్తుందా? లేదా పూర్తిగా సినిమాలకే పరిమితమైపోతుందా అనేది చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే సోనియా షార్ట్ ఫిల్మ్స్ మీకు ఏదంటే బాగా ఇష్టం? కింద కామెంట్ చేయండి.