ఒకప్పటి అందాల తార మధుబాల గుర్తుండే ఉంటుంది. రోజా సినిమాలో నటించిన హీరోయిన్. అచ్చం ఇలాంటి పోలికలతోనే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొక ముద్దుగుమ్మ ఉంది. చూడ్డానికి అచ్చం మధుబాలలానే ఉంటుంది. అందరూ ఆమెను జూనియర్ మధుబాల అని కూడా అంటారు. ఆమె మరెవరో కాదు సోనియా సింగ్. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? బ్యాగ్రౌండ్ ఏంటా అని ఆరా తీస్తున్నారు.
సోనియా సింగ్ 1998లో మార్చి 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. ఏ స్కూల్ లో చదువుకుందో, ఏ కాలేజీలో చదువుకుందో తెలియదు గానీ బీటెక్ చదివింది. యోగా చేయడం, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం బాగా అలవాటు. అయితే చదువు పూర్తయ్యాక పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ద్వారా తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించింది. ‘హే పిల్ల’ అనే యూట్యూబ్ ఛానల్ లో ఆడవారికి సంబంధించిన కంటెంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆమెకు యూట్యూబ్ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఎంతలా అంటే.. ఆమె కొన్నాళ్ళు వీడియోలు చేయక పోయేసరికి.. ఏమైంది అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ అల్లల్లాడిపోయారు. దీంతో ఆమె మళ్ళీ యూట్యూబ్ ఎంట్రీ ఇచ్చింది.
రౌడీ బేబీ ఛానల్ తో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. పెళ్ళైన కొత్తలో, న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, హైడ్ అండ్ సీక్, గుడ్ న్యూస్, ఓయ్ పద్మావతి, ఈ మాయ పేరేమిటో, సాఫ్ట్ వేర్ సావిత్రి వంటి పలు రకాల షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. పవన్ సిద్ధుతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. వీరిద్దరి జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చూసే వారికి మాత్రమే తెలిసిన సోనియా సింగ్.. తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది. 2020లో టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. కమెడియన్ అలీ నటించిన ‘యమలీల ఆ తరువాత’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.
ఈ సీరియల్ లో చిన్ని అనే పాత్రలో నటించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ సుపరిచితురాలు అయ్యింది. అప్పటి వరకూ యూట్యూబ్ కి పరిమతమైన ఆమె క్రేజ్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. బుల్లితెర మీద సత్తా చాటిన సోనియా సింగ్.. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆమె పలు టీవీ షోస్ లో కూడా పాల్గొంది. చలాకీతనం, సహజంగా ఉండే మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇటీవల ఆమె ఇచ్చిన స్పీచ్ లు కూడా బాగా వైరల్ అయ్యాయి. విరూపాక్ష ప్రమోషన్స్ సమయంలో ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పలు వెబ్ సిరీస్ లు, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. మరి పాతికేళ్లకే ఇంతలా క్రేజ్ దక్కించుకున్న సోనియా సింగ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.