'విరూపాక్ష' థియేటర్లలో బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రేక్షకులు కూడా ట్విస్టులకు థ్రిల్ అవుతున్నారు. అయితే ఈ టైటిల్ వెనకున్న లాజిక్ ఏంటనేది మీకు తెలుసా?
మెగాహీరో సాయిధరమ్ తేజ్ హిట్ కొట్టేశాడు! ‘విరూపాక్ష’గా వచ్చి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నాడు. చాలారోజుల తర్వాత ఓ మంచి హారర్ మూవీ చూశామని ప్రేక్షకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లే మూవీలో భయపెట్టే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. సినిమాలో మిగతా వాళ్ల సంగతేమో గానీ హీరోయిన్ సంయుక్త మేనన్ మాత్రం యాక్టింగ్ తో ఇచ్చిపడేసింది. అంత బాగానే ఉంది కానీ సినిమా చూసినవాళ్లకు ఓ డౌట్ మాత్రం ఉండిపోయింది. అసలు ‘విరూపాక్ష’ అంటే అర్థమేంటి? ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అని అనుకుంటున్నారు. మరి తెలుసుకోవాలని ఉందా అయితే స్టోరీ చదివేయండి.
అసలు విషయానికొస్తే.. తెలుగులో ఇదివరకు చాలా సినిమా టైటిల్స్ ని అందరూ పలకడానికి వీలుగా పెట్టేవారు. కొన్ని చిత్రాలకు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేవారు. ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ ఎందుకో చాలావరకు మారిందనిపిస్తోంది. రీసెంట్ గా హిట్ అయిన ‘బలగం’, ‘దసరా’ని తీసుకుంటే.. టైటిల్ కి సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ కూడా ఆ లిస్టులోకి చేరింది. కాకపోతే సినిమా అంతా చూసినా సరే చాలామంది టైటిల్ మీనింగ్ ఏంటనేది అర్థం కాదు. మీరు కరెక్ట్ గా పోస్టర్స్ ని గమనిస్తే అసలు విషయం ఏంటనేది తెలిసిపోతుంది.
రూపంలేని కన్నుని ‘విరూపాక్ష’ (శివుడి మూడో కన్ను) అంటారట. ఈ మూవీలోనూ రూపంలేని శక్తితో హీరో పోరాటం చేస్తుంటాడు. అందుకే ఈ మూవీకి ఈ టైటిల్ పెట్టారు! ఈ మూవీని చేతబడి, తాంత్రిక విద్యల ఆధారంగా తీసినప్పటికీ ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా చూసుకున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే రాయడంతో ఈ జాగ్రత్త తీసుకున్నారా అనిపించింది. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండుకి ఇది తొలి మూవీ అయినప్పటికీ, ప్రేక్షకుల్ని చివరివరకు థ్రిల్ చేశాడు. చిన్నచిన్న పొరపాట్లు తప్పితే.. ‘విరూపాక్ష’తో ఎంటర్ టైన్ చేశాడు. సో అదన్నమాట విషయం. రిలీజ్ కి ముందే ఈ టైటిల్ మీనింగ్ మీలో ఎంతమంది తెలుసు? కింద కామెంట్ చేయండి.