ఈసారి సంక్రాంతి రేసులో ఏ హీరో కూడా తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కలెక్షన్స్ సాధిస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోల సినిమాలు హిట్ అయ్యేసరికి ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర అంతా సందడి సందడిగా ఉంది. అయితే బాలయ్య, చిరంజీవి.. 3,4 రోజుల్లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరించిన అజిత్, విజయ్ కూడా అదే ఊపు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ‘వారసుడు’ కలెక్షన్స్ నంబర్ ని రిలీజ్ చేయగా.. ట్రేడ్ వర్గాల్ని అది ఆశ్చర్యపరుస్తోంది.
ఇక విషయానికొస్తే.. ఎప్పటిలానే ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు నిలిచాయి. కానీ నెటిజన్స్ మధ్య తెగ డిస్కషన్ లో నిలిచిన చిత్రం మాత్రం ‘వారిసు'(తెలుగులో ‘వారసుడు’). తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ హీరోగా నటించగా.. దిల్ రాజు నిర్మాత, వంశీ పైడిపల్లి దర్శకత్వం చేశాడు. అయితే ఈ మూవీ జనవరి 11న తమిళంలో రిలీజ్ కాగు, జనవరి 14న తెలుగులో రిలీజైంది. ఫస్ట్ నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి.
తొలి ఐదు రోజుల్లో రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విజయ్ ‘వారసుడు’.. రిలీజైన వారంలోనే రూ.210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇక తెలుగులో రిలీజై నాలుగు రోజులు అవుతుండగా.. కేవలం రూ 20.25 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. తమిళనాడు, ఓవర్సీస్ లో మాత్రం వరసగా రూ 86.40 కోట్లు, రూ 71.80 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఉంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధిస్తున్న ఈ మూవీ.. లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. మరి విజయ్ కొత్త సినిమా వసూళ్లపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Crs+ collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023