విజయ్ దేవరకొండ.. గత కొన్ని ఏళ్ల క్రితమే తెలుగు తెరకు పరిచయమై తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ బంపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో విజయ్ రేంజ్ ఒక్కసారిగా మారింది. ఈ దెబ్బకు స్టార్ హీరోల లీస్టులోకి చేరుకున్నాడు రౌడీ హీరో విజయ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..?
సింగర్ షణ్ముఖ ప్రియకు తన లైగర్ సినిమాలో అవకాశం ఇస్తానని విజయ్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే.. షణ్ముఖ ప్రియ..తెలుగు వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో పాడుతా తీయగా, సరిగమప లిటిల్ ఛాంప్స్ వంటి ప్రోగ్రామ్ లోనే కాకుండా అనేక సింగింగ్ వేదికల్లో పాల్గొని సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన అద్భతుమైన గాత్రంతో ఎన్నో అవార్డులను సైతం అందుకుంది సింగర్ షణ్ముఖ ప్రియ. ఇక ఇటీవల ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ ఐడల్ లో పాల్గొని గెలుపు అంచుల వరకు వెళ్లి ఒడిపోయింది.
ఓడిపోయిన సింగర్ ప్రియకు మాత్రం ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇదే విషయమై లైగర్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించటం విశేషం. ఈ వీడియోలో స్వయంగా షణ్ముకు ప్రియ కుటుంబ సభ్యులతో సహా తన ఇంటికి పిలిపించుకుని అభినందించాడు విజయ్. దీనికి సబంధించిన వీడియో సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.