లైగర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్. ఈసినిమాను పూరీ జగన్నాధ్, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పూరీ- విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో లైగర్ టీమ్ ప్రచారంలో జోరు పెంచారు. ఈక్రమంలో సౌత్ లో అనేక చోట్ల ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో విజయ్ ని మీడియా వాళ్లు పలు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు విజయ్ చాలా సింపుల్ గా సమాధానాలు ఇస్తూ.. సినిమాకు సంబధించిన అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. స్టార్ కిడ్స్ ని మాత్రమే లాంఛ్ చేసే కరణ్ జోహార్ మీకెందుకు అవకాశం ఇచ్చాడు..? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయ్ సూపర్ రిప్లై ఇచ్చారు.
విజయ్ మాట్లాడుతూ..”కరణ్ చాలా మంది స్టార్ కిట్స్ ని వెండి తెరకి పరిచయం చేశారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో చూస్తే వరణ్ ధావన్, ఆలియ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా అనే కొత్త వ్యక్తిని లాంచ్ చేశారు. ఇదే సినిమాలో మరొక కొత్త అమ్మాయిని కూడా కరణ్ జోహార్ లాంచ్ చేశారు. కరణ్ జోహార్ ఏ సినిమా చేసిన అందులో కొత్తవాళ్లు కచ్చితంగా ఉంటారు. అలా ఆయన ప్రస్తుతం తీస్తున్న మరొక సినిమాలో ఓ స్టార్ ఫ్యామిలీ అమ్మాయితో పాటు ఇద్దరు కొత్త యువకులను పరిచయం చేస్తున్నారు. అలానే ఆయన సర్కిల్ లో ఉండే వారి పిల్లలను కూడా వెండి తెరకు పరిచయం చేశారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తరువాత కరణ్ జోహార్ నాతో మాట్లాడటం జరిగింది. ఆ సినిమాతో పాటు అందులో నా నటన ఆయనకు బాగా నచ్చింది.
నాకు ఎప్పుడైన హిందీలో సినిమా చేయాలనిపిస్తే..ఆయనకు నాతో చేయాలని ఉందని అన్నారు. ఆ సమయంలో నేను హిందీ సినిమాలో నటించేందుకు రెడీగా లేకుంటిని. ఈక్రమంలో లైగర్ సినిమాను హిందీలో చేయాలనుకున్నప్పడు. ఆయనకు ఆ విషయం తెలియజేశాం. ఆయన కథ వినకుండానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయినా.. ఓ సారి మేమే కథ వినిపించాము. ఆయన ఎప్పుడు నా ఆర్థిక, కుటుంబ నేపథ్యం గురించి అడగలేదు. కేవలం నేను నటుడిగా ఆయనకు నచ్చడం వలనే నాతో సినిమా చేసేందుకు సిద్దమయ్యారు.
ప్రతిభను గుర్తించే గొప్ప నిర్మాతల్లో ఆయన ఒకరు. సినిమాను ఇండియా మొత్తంలో విడుదల చేయండలో కరణ్ జోహార్ పాత్ర ఎంతగానో ఉంది. ఆయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయంచేశారు” అని రౌడీ హీరో విజయ్ తెలిపాడు. మరి.. కరణ్ జోహర్ పై విజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.