ట్రైలర్ లేదా మూవీకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే హీరోని చూపిస్తుంటారు. కానీ 'బిచ్చగాడు 2' టీమ్ అలా చేయలేదు. కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ తో కేక పుట్టించారు!
ఏ సినిమా అయినా సరే హీరో లేదా హీరోయిన్ ఎవరు? ట్రైలర్ ఎలా ఉంది? అనేది ప్రేక్షకులు పక్కాగా చూస్తారు. పోస్టర్ నుంచి థియేటర్లలో లేదా ఓటీటీలో మూవీ రిలీజ్ వరకు వాళ్లనే ముందు పెట్టి ప్రమోషన్స్ కూడా చేస్తారు. కానీ ‘బిచ్చగాడు 2’ టీమ్ మాత్రం చాలా కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్.. దానికి ఉదహరణ అన్నట్లు ఉంది. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే.. సీక్వెల్ ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసినట్లు అనిపిస్తోంది. మరి ‘బిచ్చగాడు 2’ ఎలా ఉండబోతుంది? ఏంటనేది ఇప్పుడు ట్రైలర్ రివ్యూలో చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ఓ సాధారణ సినిమాగా విడుదలై సెన్షేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘బిచ్చగాడు’. ఓ సినిమా హీరో, బెగ్గర్ గెటప్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించరు. దాన్ని చేసి చూపించాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ హిట్స్ ఏం కొట్టలేకపోయాడు. త్వరలో ‘బిచ్చగాడు 2’గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా స్నీక్ పీక్ ట్రైలర్ పేరుతో దాదాపు 4 నిమిషాలపాటు ఉన్న ఓ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఇందులో హీరో విజయ్ ఆంటోని ఎక్కడా కనిపించకపోవడం విశేషం.
బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు ట్రైలర్ బట్టి తెలిసిపోయింది. రామానుజన్, ఐన్ స్టీన్ లాంటి వాళ్ల బ్రెయిన్స్ ని ఇలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ఏళ్లకు ఏళ్లకు సమాజానికి ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నామని.. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే బాగుంటుందని ఓ డాక్టర్ చెబుతుంటాడు. టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఈ ఇంటర్వ్యూని విలన్ దేవ్ గిల్ చూస్తుంటాడు. అంతకు ముందు అతడు ఎంత క్రూరమైన వాడు అనేది పాము ఉన్న బోనులో మనోడే ఎలుక వేసినట్లు చూపించారు. దీన్నిబట్టి చూస్తుంటే.. విలన్ తన బ్రెయిన్ ని ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి హీరో విజయ్ ఆంటోని ఫిక్స్ చేస్తారేమో? ఆ తర్వాత ఎలాంటివి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ‘మనీ వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదం’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇలా ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘బిచ్చగాడు 2’.. ఈ వేసవిలో థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా ట్రైలర్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.