ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎవరి పెళ్లి గురించి అయినా ఎక్కువగా చర్చ జరుగుతుంది అంటే.. అది లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శఖుడు విఘ్నేష్ శివన్లదే. ఏళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. తమ బంధం గురించి ఒపెన్‌గా బయటకు వెల్లడించారు. ఇక ఇద్దరు కలిసి టూర్లు, వెకేషన్లు, సెలబ్రేషన్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ జంట షిర్డి, తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి గురించి వార్తలు కూడా వచ్చాయి. జూన్ 9న వీరిద్దరు తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇక ఈ లవ్ బర్డ్స్.. తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో నయన్ అంటే తనకు ఎంతో ప్రేమో మరోసారి చాటుకున్నాడు విఘ్నేష్. ఆమెకు గోరు ముద్దులు తినిపిస్తూ.. మురిసిపోయాడు. లోకల్లో దొరికే రుచికరమైన ఆహారాన్ని తనకు తినిపించడం అంటే నాకు ఎంతో సంతోషం. అందునా తనకు ఎంతో ఇష్టమైన సీఫుడ్ రెస్టారెంట్ నుంచి తెచ్చిన ఆహారం అంటే భలే ఇష్టం. ఈ ఇళ్లు.. ఇక్కడి అద్భుతమైన మనుషులు మాకు రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తుంటారు. ఇక్కడ మాత్రమే మేం తినడాన్ని ఎంజాయ్ చేస్తాం అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో విఘ్నేష్, నయన్‌కు తన ఎదురుగా ఉన్న ఫుడ్ చూపించి తినమంటే ఆమె వద్దంటుంది. అప్పుడు విఘ్నేష్.. తానే స్వయంగా ఆమెకు ఎంతో ప్రేమతో తినిపిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజనుల.. క్యూట్ కపుల్.. నయన్ అంటే ఎంతో ప్రేమో.. మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara: నయనతార కంటే నువ్వే అందంగా ఉన్నావ్.. యాంకర్‌పై ప్రశంసలు..
ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కాంబినేషన్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన కణ్మణి రాంబో ఖతీజా చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ప్రస్తుతం నయన్ తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాక మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఇక మరి ఈ ఏడాదైన వీరు పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. విఘ్నేష్ శివన్ షేర్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.