కొన్నాళ్ల ముందు జరిగిన ఇంటర్వ్యూ గొడవపై.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా మరోసారి రియాక్ట్ అయ్యాడు. అప్పటినుంచి ఓ విషయం తనని తెగ భయపెడుతోందని అన్నాడు.
ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు సెలబ్రిటీలు ఏం మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండాలి. లేదంటే తేరుకునేలోపు రచ్చ రచ్చ అయిపోతుంది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్స్ చేసి డైరెక్టర్ వెంకటేష్ మహా బుక్కయ్యాడు. ఇండస్ట్రీలో పెద్ద చర్చకు కారణమయ్యాడు. తనని తాను కంట్రోల్ చేసుకోలేక కాస్త శ్రుతిమించి, వేరే పదాలు అన్నాడు. ఇప్పుడు ఆ ప్రస్తావన మరోసారి వచ్చింది. దీంతో దానిపై తన అభిప్రాయాన్ని మరోసారి బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి సినిమా అందరికీ నచ్చాలని రూలేం లేదు. పాన్ ఇండియా రేంజులో సక్సెస్ అయిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ నచ్చనివాళ్లు కూడా కొందరున్నారు. అలా ‘కేజీఎఫ్’ నచ్చలేదని.. కొన్నాళ్ల ముందు డైరెక్టర్ వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాకపోతే అందులో రాకీభాయ్ క్యారెక్టర్ ని ‘నీచ్ కమినే కుత్తే’ అని సంభోదిస్తూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఓ వీడియో పోస్ట్ చేసి సారీ చెప్పాడు. దీంతో అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ వచ్చింది.
డైరెక్టర్ గా కంటే ఈ మధ్య కాలంలో యాక్టింగ్ తో బిజీగా మారిపోయిన ‘ఉస్తాద్’ మూవీలోనూ నటించాడు. తాజాగా టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. అందులో మాట్లాడుతూ అప్పటివిషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత యాంకర్స్ తో మాట్లాడాలంటే భయమేస్తుందని ఫన్నీగా అన్నాడు. ఈ క్రమంలోనే స్టేజీపై ఉన్న చీఫ్ గెస్ట్ రానాతో పాటు అందరూ నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో వెంకటేష్ మహాపై సెటైర్స్ కూడా పేలుతున్నాయి. ‘అప్పుడలా మాట్లాడటం ఎందుకు? ఇప్పుడిలా అనడం ఎందుకు’ అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి వెంకటేష్ మహా అన్నదానిపై మీ రియాక్షన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.