ఆ భామ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. అలాంటిది ఆమె వస్తువులు తీసుకుని ట్యాక్సీ డ్రైవర్ జంప్ అయిపోయాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
యాక్టర్స్, సెలబ్రిటీలకు కూడా కొన్నిసార్లు తిప్పలు తప్పవు. అది ఎప్పుడు ఎలా జరుగుతుందనేది అస్సలు చెప్పలేం. ఇప్పుడు కూడా అలానే బాగా ఫేమ్ ఉన్న ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్నే ఆమె సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నటికి అంత ఇబ్బంది కలిగించే అంశం ఏంటి? అసలేం జరిగింది తెలియాలంటే డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.
ఇక విషయానికొస్తే.. బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న భామ ఉర్ఫీ జావేద్. షో అయిపోయిన తర్వాత తనదైన స్టైల్లో డ్రస్సింగ్ స్టైల్ తో వార్తల్లో ఉంటూనే ఉంది. అసలు ఊహకే అందని విధంగా రకరకాల వస్తువులతో డిజైన్స్ చేయిస్తూ బికినీ, డ్రస్సులు వేసుకుంటూ ఉంటుంది. ఇక ఈమెపై డ్రస్సింగ్ విషయమై ట్రోల్స్ కూడా బాగానే వస్తుంటాయి. వాటిపైనా కౌంటర్స్ వేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే ఈ భామకు చేదు అనుభవం ఎదురైంది. దిల్లీలో తను ఉంటున్న ఏరియా నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. దారి మధ్యలో భోజనం కోసం ఓ రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఈ క్రమంలోనే ఆమె లగేజీతో ఆ డ్రైవర్ కాస్త ఉడాయించాడని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
ఇక ఈ వీడియోకు క్యాప్షన్ గా… ‘ఈ రోజు నాకు వరస్ట్ ఎక్స్ పీరియెన్స్ జరిగింది. ట్యాక్సీ డ్రైవర్ నా లగేజీతో మాయమైపోయాడు. దాదాపు రెండు గంటల తర్వాత వచ్చాడు కానీ అప్పటికే ఫుల్ తాగేసి ఉన్నాడు. ఉబర్.. మీరు అమ్మాయిల విషయంలో కాస్త సేఫ్టీ తీసుకోవాలి’ అని ఉర్ఫీ రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్.. ‘మంచి ఎక్స్ పీరియెన్స్. నీకు ఇలా జరగాల్సిందే’, ‘మెట్రో యూజ్ చేయ్. చాలామంది ప్రజలు నీతో సెల్ఫీలు తీసుకుంటారు. తద్వారా నీకు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది’, ‘అందుకే ఆటోలు చాలా బెస్ట్. నెక్స్ టైమ్ ఆటో బుక్ చేసుకో’ అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఉర్ఫీ.. పలు సాంగ్స్, యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈమె లగేజీతో ట్యాక్సీ డ్రైవర్ జంప్ అవడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి./p>
Had the worst experience with @UberINSupport @Uber in delhi,booked a cab for 6 hours,on my way to airport stopped to have lunch, the driver vanished with my luggage in the car. After interference from my male friend the driver came back completely drunk after 1 hour @Uber_India pic.twitter.com/KhaT05rsMQ
— Uorfi (@uorfi_) February 21, 2023