మెగా ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడనే విషయాన్ని కొన్నిరోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ తెగ ఆనందంలో ఉన్నారు. ఇతర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ విష్ చేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. కుటుంబ సభ్యులు అందరితోనూ చాలా సంతోషంగా గడిపింది. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోస్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లో వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇక 2012లో అపోలో సంస్థల అధినేత మనవరాలు ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మధ్యే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ గుడ్ విషెస్ చెప్పారు.
ఇక తాజాగా పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలో మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. అయితే తన అత్తమ్మ సురేఖని మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టారు. ‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీస్సులతో మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ టైంలో అత్తమ్మను మిస్ అవుతున్నాను’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోల్లో ఉపాసన తల్లి శోభన కామినేనితో, అమ్మమ్మతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగాఫ్యాన్స్ వీటిని షేర్ చేస్తూ.. కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ఉపాసన షేర్ చేసి ఫొటోలు మీకెలా అనిపించాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.