ప్రతి సీజన్ కొంత కంటెస్టెంట్ లను తెస్తూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే బిగ్ బాస్ ఈసారి కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సారి ప్రేక్షకులకి సర్ ప్రైజ్ ఇస్తూ బుల్లి తెర మెగా స్టార్ ప్రభాకర్ ని కంటెస్టెంట్ గా తీసుకొని వస్తున్నారు.
బిగ్ బాస్ వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులకి పండగే. ఒక్కసారి ఈ షో మొదలైందంటే టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరల్డ్ టెలివిజన్ లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకొని టెలివిజన్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 7 సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. గత కొంతకాలంగా ఈ షో జరుగుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అయినా ఇటీవలే విడుదలైన ప్రోమోతో ఈ షో త్వరలో ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఇప్పుడు ఈ షోలో కంటెస్టెంట్ లు ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ అంచనాలను పెంచేస్తూ ఎవ్వరూ ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రతి సీజన్ కొంత కంటెస్టెంట్ లను తెస్తూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే బిగ్ బాస్ ఈసారి కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సారి బుల్లి తెర మెగా స్టార్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. అతడెవరో కాదు సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించిన ప్రభాకర్ కావడం విశేషం. కెరీర్ మొదట్లో యాహు అనే టీవీ షో తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాకర్. ఇక ఆ తర్వాత ఆయన ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస పెట్టి సీరియల్స్ చేస్తూ ఎంతో మంది బుల్లి తెర అభిమానులని సొంతం చేసుకున్నాడు. సీరియల్స్ లో నటించడమే కాదు కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించాడు. నటుడిగా కూడా ఇతనికి మంచి పేరుంది.
శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోధన సినిమాలో పోలీసుగా నటించి ఆకట్టుకున్న ప్రభాకర్.. ఆ తర్వాత తనకిష్టమైన సీరియల్స్ మీద దృష్టి పెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. దీంతో ఈ బుల్లి తెర మెగా స్టార్ ని హౌస్ లోకి తీసుకొని వస్తే ఆడియన్స్ థ్రిల్ కావడం గ్యారంటీ అని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ షోలో ప్రభాకర్ రోహిత్ కి సపోర్ట్ చేశాడని తెలుస్తుంది. ప్రభాకర్ హౌస్ లోకి ఎంటర్ అయితే రచ్చ రచ్చే అంటున్నారు నెటిజన్స్. ఒకవేళ ప్రభాకర్ ఈ ఆఫర్ ని తిరస్కరిస్తే అతని స్థానంలో ఆయన కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వచ్చినా సరే అంటున్నారు. ఇక ఈ షో ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రభాకర్ ని ఈ షో కి తీసుకువస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.