కోలీవుడ్ బిగ్‌బాస్ -7లోకి సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి దాదాపుగా కన్‌ఫామ్ అయ్యారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కూడా ఎంపిక అయ్యారు.
షర్మిల ఓ కామన్ ఉమెన్ అయినా.. మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. ఈమె తమిళనాడు కోయబత్తూరుకు చెందిన మహిళ. ఈమె చాలా సాధారణ మహిళ అయినా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఆతర్వాత చిత్ర పరిశ్రమలోని చాలాపేరుగాంచిన హీరో కమల్ హాసన్ మద్ధతు కూడా పొందింది. తమిళనాడులో కూడా బిగ్‌బాస్ షో ఆగస్టులో మొదలవనుంది. కోలీవుడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి దాదాపుగా అందరు సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అందులో షర్మిల ప్రత్యేకంగా పరిచయం కాననుంది. షర్మిల కోలీవుడ్ బిగ్‌బాస్-7 లోకి ఎంట్రీ దాదాపు కన్‌ఫామ్ అయినట్లే. అయితే మనం షర్మిల గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం..
తమిళనాడులోని కోయంబత్తూరు ప్రైవేట్ బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా షర్మిల అందరికి సుపరిచితురాలు. చాలాకొద్ది రోజుల్లోనే అందరి మన్ననలు పొందింది. కానీ ఆమె నడిపిన బస్సులో తమిళనాడు ఎంపీ కనిమొళి ప్రయాణం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమె తన డ్రైవర్ జాబ్ పోగొట్టుకోవలసి వచ్చింది. డ్రైవర్‌గా ఉన్నపుడే షర్మిల చాలా పాపులర్ అయింది. ఓ సాధారణ మహిళ బస్సు నడపడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది షర్మిలను ఆదర్శంగా తీసుకున్నట్లు, ఆమెను మెచ్చుకుంటూ కామెంట్స్ ఇచ్చారు. షర్మిల కోసం ఎంపీ కనిమొళి రావడంతో ఆ బస్సు కండక్టర్‌కు నచ్చలేదు. ఆమె కనిమొళి అనుచరులతో దురుసుగా ప్రవర్తించడం మొదలెట్టింది. కండక్టర్‌ను షర్మిల వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నెక్ట్స్ స్టాప్‌లో ఎంపీతో పాటుగా అందరు దిగిపోయారు.
షర్మిలకు కండక్టర్ ప్రవర్తించిన తీరు నచ్చలేదు. తన యజమాని పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతుందని అనడంతో షర్మిల తన డ్రైవర్ జాబ్ వదిలేసింది. ఆ కండక్టర్ ఉన్న బస్సు నడపలేనని చెప్పి వచ్చేసింది. ఇలా వివాదంలో చిక్కుకుని ఉద్యోగం కోల్పోయిన షర్మిలకు కమల్ హాసన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కారు గిఫ్ట్ ఇచ్చారు. తన ఆఫీస్‌కు పిలిపించి ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును కానుకగా అందించారు. ఇప్పుడు షర్మిల ఎంతోమందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని దీవించారు. తాజాగా ఆమెకు బిగ్‌బాస్-7 లోకి ఎంట్రీ దాదాపుగా కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ షో ఎంట్రీ వరకు కలమల్ నుంచి ఆమె సాయం పొందుతుంది. ఈ షోతో షర్మిల మరింత పాపులర్ కానుంది.