“ధూమ పానం, మద్య పానం చేయడం ఆరోగ్యానికి హానికరం” అని ప్రజల సంక్షేమం కోసం సినిమా థియేటర్లలో ప్రకటనలు ప్రసారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు.. ‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు’.. అంటూ ఒక చిన్న పాప.. తండ్రితో కలిసి టీవీ చూసే ప్రకటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ప్రకటనలో ఓ వ్యక్తి తన చిన్న కూతురుతో కలిసి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతుండగా.. పక్కనే ఉన్న కూతురు తండ్రి వైపు ఎంత అమాయకంగా చూస్తుందో అందరకి గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క చూపుతునే అతను ‘సిగరెట్ స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం’ అని తెలుసుకొని సిగరెట్ ని కాల్చడం మానేస్తాడు. అయితే ఈ యాడ్ లో నటించిన చిన్నపిల్ల ప్రస్తుతం పెద్దై సినిమాలు, సీరియళ్లు అంటూ బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఈ ప్రకటనలో నటించిన చిన్నపిల్ల పేరు సిమ్రాన్ నటేకర్. ముంబై నగరంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతానికి మోడలింగ్ రంగంలో డిగ్రీని పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో చిన్నప్పుడు నో స్మోకింగ్ అవేర్నెస్ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. ఈ ప్రకటన తరువాత 150 పైగా.. యాడ్ లలో నటించడం విశేషం. ఇప్పటికీ.. ముంబై నగరంలో నో స్మోకింగ్ అవేర్నెస్ పోస్టర్ కు ఈ అమ్మాయి ఫొటోస్ దర్శమిస్తాయి. ఇలా.. మొదటి ప్రకటనతో అందరిని ఆకర్షించిన ఈ అమ్మాయి సినిమాలు, సీరియళ్లు అంటూ బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఇది కూడా చదవండి: Shraddha Das: హీట్ ఎక్కిస్తున్న శ్రద్ధా దాస్ హాట్ పిక్స్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో పూజ పాత్ర చేసింది ఈ అమ్మాయే. అంతేకాదు.. 2010లో రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన జానే కహాన్ సే ఆయీ హై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సిమ్రాన్ నటేకర్ చిన్న చిన్న పాత్రలలో నటిస్తోంది.అంతే కాకుండా పలు హిందీ సీరియల్స్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సిమ్రాన్ నటేకర్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది.