తమ్ముడు సినిమాలో జుమాంజి పాత్ర చేసిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ సినిమాలో తన అమాయకమైన నటనతో అందరినీ నవ్వించిన ఆయన ఆ సినిమా తర్వాత..
పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో ‘తమ్ముడు’ సినిమాకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా అప్పట్లో యూత్‌ను తెగ పిచ్చెక్కించింది. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్‌కు ఇప్పటికి సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియా మీమ్స్‌లో ఈ కామెడీ ట్రాక్‌లకు సంబంధించిన ఫొటోలను తెగ వాడుతూ ఉంటారు. ఇక, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో ‘జుమాంజి’ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. ముఖం కప్పేసేలా జుట్టుతో.. లావుగా ఉండే ఆ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది.
అలాంటి పాత్రలో కనిపించిన ఆ నటుడు పేరు చాలా మందికి తెలీదు. అతడి పేరు శివ. ఆయన కేవలం ఆ ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. ఇందుకు కారణం కూడా ఉంది. అదేంటంటే.. ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు పీ అరుణ్ ప్రసాద్‌కు శివ ఫ్రెండ్. దీంతో సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని ఆయన శివను అడిగాడు. ఫ్రెండ్ మాటను కాదనలేక శివ తమ్ముడు సినిమాలో జుమాంజి పాత్రను చేశాడు.
ఇదే ఆయన మొదటి, చివరి సినిమా. తర్వాత ఏ సినిమాలోనూ శివ నటించలేదు. అనంతరం పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఎమ్ఎస్ చదివారు. చదువు పూర్తయిన తర్వాత ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల క్రితం సొంతంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీని మొదలుపెట్టారు. ఆ కంపెనీ దిగ్విజయంగా నడుస్తోంది. ఈ విషయాలను నటుడు అలీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. మరి, తమ్ముడు సినిమాలో జుమాంజి పాత్రతో అందరినీ అలరించిన శివపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.